నెలఁతకు నేఁటికంటె నిన్ననే మేలాయ
(॥పల్లవి॥)
నెలఁతకు నేఁటికంటె నిన్ననే మేలాయ
తలపోసి తలపోసి తన్నుఁ దానె మఱచె
(॥నెలఁత॥)
చింతాజలధి యింకె చెలివిరహాగ్నిచే
చెంతనున్న యట్టి చెక్కుచేయి జారె
వంతల వ్రాసేటి నేలవ్రాఁతలునట్టే నిలిచె
వింతలైనవెల్లిమీఁద వెల్లి దోఁచెనదివో
(॥నెలఁత॥)
పులకలు వాడె నిట్టూర్పుల గాలిచేతను
సొలసి యిప్పటి ఆపసోపము వాసె
తలఁకక యిందాఁకా దైవము దూరేదీఁ బోయ
వలపులు రేఁగి రేఁగి వడిఁ బడెనదివో
(॥నెలఁత॥)
చొక్కుదేరె కన్నులను చూచేటి ఆసలచేఁత
నిక్కి లేచి కూచుండె నీవు రాఁగాను
యిక్కువ శ్రీవేంకటేశ యిటు నీవు గూడితివి
చిక్కులు సిగ్గులుఁ బాసి చిమ్మిరేఁగెనదివో
(||pallavi||)
nĕlam̐tagu nem̐ṭigaṁṭĕ ninnane melāya
talabosi talabosi tannum̐ dānĕ maṟasĕ
(||nĕlam̐ta||)
siṁtājaladhi yiṁkĕ sĕlivirahāgnise
sĕṁtanunna yaṭṭi sĕkkuseyi jārĕ
vaṁtala vrāseḍi nelavrām̐talunaṭṭe nilisĕ
viṁtalainavĕllimīm̐da vĕlli dom̐sĕnadivo
(||nĕlam̐ta||)
pulagalu vāḍĕ niṭṭūrbula gālisedanu
sŏlasi yippaḍi ābasobamu vāsĕ
talam̐kaga yiṁdām̐kā daivamu dūredīm̐ boya
valabulu rem̐gi rem̐gi vaḍim̐ baḍĕnadivo
(||nĕlam̐ta||)
sŏkkuderĕ kannulanu sūseḍi āsalasem̐ta
nikki lesi kūsuṁḍĕ nīvu rām̐gānu
yikkuva śhrīveṁkaḍeśha yiḍu nīvu gūḍidivi
sikkulu siggulum̐ bāsi simmirem̐gĕnadivo