Nelamtagu ne poddoo nee meemdide paraagu

నెలఁతకు నే పొద్దూ నీ మీఁదిదే పరాకు
Language

(॥పల్లవి॥)
నెలఁతకు నే పొద్దూ నీ మీఁదిదే పరాకు
అలరి తడవు సేయక ఇట్టే రావయ్యా

(॥॥)
సారె మా విన్నపా లెల్లాఁ జన విచ్చి వింటివి
నీరు వలెఁ గరఁగెను నీ చిత్తము
తారుకాణ చూచుకో తరుణివలపు లిఁక
చేరి మారు మాటేమని చెప్పుదుమయ్యా

(॥॥)
పడఁతి యంపిన నిమ్మ పండు చే నందుకొంటివి
వుడివోని సంతోసాన నుప్పొంగితివి
బడి నాపెతో నాడిన పలుకులు దలఁచుకో
తడవి నీ కాపె పై తలఁ పెట్టి దయ్యా

(॥॥)
నెమ్మది మా వెంటనే నీవు విచ్చేసి మా
యమ్మపాన్పునఁ గూచుండీ అమరితివి
యిమ్ముల నలమేల్మంగ యీకె శ్రీ వేంకటేశ్వర
సమ్మతిలఁ గూడితివి జాణ వౌదు వయ్యా

(||pallavi||)
nĕlam̐tagu ne pŏddū nī mīm̐dide parāgu
alari taḍavu seyaga iṭṭe rāvayyā

(||||)
sārĕ mā vinnabā lĕllām̐ jana vichchi viṁṭivi
nīru valĕm̐ garam̐gĕnu nī sittamu
tārugāṇa sūsugo taruṇivalabu lim̐ka
seri māru māḍemani sĕppudumayyā

(||||)
paḍam̐ti yaṁpina nimma paṁḍu se naṁdugŏṁṭivi
vuḍivoni saṁtosāna nuppŏṁgidivi
baḍi nābĕdo nāḍina palugulu dalam̐sugo
taḍavi nī kābĕ pai talam̐ pĕṭṭi dayyā

(||||)
nĕmmadi mā vĕṁṭane nīvu vichchesi mā
yammabānpunam̐ gūsuṁḍī amaridivi
yimmula nalamelmaṁga yīgĕ śhrī veṁkaḍeśhvara
sammadilam̐ gūḍidivi jāṇa vaudu vayyā