Nelamta yemtadijaano neevemta sadurumdavo

నెలఁత యెంతటిజాణో నీవెంత చతురుఁడవో
Language

(॥పల్లవి॥)
నెలఁత యెంతటిజాణో నీవెంత చతురుఁడవో
పిలిచితేఁ జెలియకు ప్రియము చెప్పితివి

(॥నెల॥)
మగువ యలిగి నీతో మారుమోము వెట్టుకొని
మొగిచి యప్పటి నీతో మోము చూచెను
నగుతా నప్పటి నీవు నలినాక్షిఁ గాఁగిలించి
పగటున నాదరించి పంతములిచ్చితివి

(॥నెల॥)
మానిని నీతోఁ గొంత మౌనము జరపి యట్టె
మానములు సోఁకించి మాటలాడెను
కానిమ్మని నీ వందుకు గతిగూడ నింపు చల్లి
మేనవావి పచరించి మేలెల్లాఁ జూపితివి

(॥నెల॥)
కోమలి ముసుఁగువెట్టుకొని పవళించి నిన్ను
గామిడి శ్రీవేంకటేశ కాఁగిలిచెను
దోమటి దొడికి నీవు తొలుతటికంటెను
సేమమునుఁ బాలించి సిరుల మించితివి

(||pallavi||)
nĕlam̐ta yĕṁtaḍijāṇo nīvĕṁta sadurum̐ḍavo
pilisidem̐ jĕliyagu priyamu sĕppidivi

(||nĕla||)
maguva yaligi nīdo mārumomu vĕṭṭugŏni
mŏgisi yappaḍi nīdo momu sūsĕnu
nagudā nappaḍi nīvu nalinākṣhim̐ gām̐giliṁchi
pagaḍuna nādariṁchi paṁtamulichchidivi

(||nĕla||)
mānini nīdom̐ gŏṁta maunamu jarabi yaṭṭĕ
mānamulu som̐kiṁchi māḍalāḍĕnu
kānimmani nī vaṁdugu gadigūḍa niṁpu salli
menavāvi pasariṁchi melĕllām̐ jūbidivi

(||nĕla||)
komali musum̐guvĕṭṭugŏni pavaḽiṁchi ninnu
gāmiḍi śhrīveṁkaḍeśha kām̐gilisĕnu
domaḍi dŏḍigi nīvu tŏludaḍigaṁṭĕnu
semamunum̐ bāliṁchi sirula miṁchidivi