నెలఁత సొబగు లివి నీ సొమ్ము
(॥పల్లవి॥)
నెలఁత సొబగు లివి నీ సొమ్ము
కలసి మెలసి యిటు గైకొనవయ్యా
(॥॥)
వేమరు నవ్వుల వెన్నెల గాసీ
రామ కడకు నిటు రావయ్యా
దోమటి పలుకుల దొరిగీఁ దేనెలు
ఆమని కాలము అవధరించవయ్యా
(॥॥)
వలపుల చెమటల వానలు గురిసీ
సొలవక యీకెనుఁ జూడవయ్యా
పెలుచుఁ గుచంబుల పిందెలు వొడమెను
అలరిన కానుక లందుకోవయ్యా
(॥॥)
గములై మెయి మరుకళలు దొలఁకీ
తమితోఁ గౌఁగిటఁ దగులవయ్యా
జమళి శ్రీ వేంకటేశ్వర సతిఁ గూడితి
వమరె నీకు మే లవునయ్యా
(||pallavi||)
nĕlam̐ta sŏbagu livi nī sŏmmu
kalasi mĕlasi yiḍu gaigŏnavayyā
(||||)
vemaru navvula vĕnnĕla gāsī
rāma kaḍagu niḍu rāvayyā
domaḍi palugula dŏrigīm̐ denĕlu
āmani kālamu avadhariṁchavayyā
(||||)
valabula sĕmaḍala vānalu gurisī
sŏlavaga yīgĕnum̐ jūḍavayyā
pĕlusum̐ gusaṁbula piṁdĕlu vŏḍamĕnu
alarina kānuga laṁdugovayyā
(||||)
gamulai mĕyi marugaḽalu dŏlam̐kī
tamidom̐ gaum̐giḍam̐ dagulavayyā
jamaḽi śhrī veṁkaḍeśhvara sadim̐ gūḍidi
vamarĕ nīgu me lavunayyā