Nelamta sittamu koddi neeveṟamgavaa

నెలఁత చిత్తము కొద్ది నీవెఱఁగవా
Language

(॥పల్లవి॥)
నెలఁత చిత్తము కొద్ది నీవెఱఁగవా
కలయఁగవలెఁ గాక కాఁక సేతురా

(॥నెలఁత॥)
ప్రియములు చెప్పఁగానే బిగిసేవు చెలితోడ
నయగారితనమున నవ్వేవు
క్రియ గూడ నాకె నీకు కెరలి బాఁతి పడఁగ
దయఁ జూడవలెఁ గాక తడవులు సేతురా

(॥నెలఁత॥)
పలుసన్నలు సేయఁగా పరాకయ్యేవింతితోడ
చలము దొరతనాన సాదించేవు
వలచి నీకు నాపె వంచి చేతుల మొక్కఁగ
నెలకొనవలెఁ గాక నీటు సేతురా

(॥నెలఁత॥)
వొగిఁ గాఁగిలించుకోఁగా వొరసేవతివతోడ
పగటు శ్రీ వేంకటేశ పచ్చి సేసేవు
మొగము చూపి ఆపె ముచ్చటలు చెప్పఁగాను
చిగిరింపింతురు గాక జీరదీతురా

(||pallavi||)
nĕlam̐ta sittamu kŏddi nīvĕṟam̐gavā
kalayam̐gavalĕm̐ gāga kām̐ka sedurā

(||nĕlam̐ta||)
priyamulu sĕppam̐gāne bigisevu sĕlidoḍa
nayagāridanamuna navvevu
kriya gūḍa nāgĕ nīgu kĕrali bām̐ti paḍam̐ga
dayam̐ jūḍavalĕm̐ gāga taḍavulu sedurā

(||nĕlam̐ta||)
palusannalu seyam̐gā parāgayyeviṁtidoḍa
salamu dŏradanāna sādiṁchevu
valasi nīgu nābĕ vaṁchi sedula mŏkkam̐ga
nĕlagŏnavalĕm̐ gāga nīḍu sedurā

(||nĕlam̐ta||)
vŏgim̐ gām̐giliṁchugom̐gā vŏrasevadivadoḍa
pagaḍu śhrī veṁkaḍeśha pachchi sesevu
mŏgamu sūbi ābĕ muchchaḍalu sĕppam̐gānu
sigiriṁpiṁturu gāga jīradīdurā