Nelamta simgaaramu nee bhaagyamaaya

నెలఁత సింగారము నీ భాగ్యమాయ
Language

(॥పల్లవి॥)
నెలఁత సింగారము నీ భాగ్యమాయ
తలఁపు లీడేరె మీకుఁ దగుఁ దగునయ్యా

(॥నెలఁ॥)
భామ చనుఁగవ నదె బంగారువానగురిసీ
తేమలెక్కి మోవివెంటఁ దేనెగారీని
మోమునఁ జంద్రకళలు ముంచి కారుకమ్మీని
నీ మోమము తెప్పలపై నించి తేలించవయా

(॥నెలఁ॥)
మొనసి సెలవులను ముత్యాలపంటలు నిండె
తనువున వలపులు దైలువారీని
వొనరిన యారుపొంత నున్నవి వళితరంగాలు
యెనసె నీ వేడుకలు యీఁదులాడించవయా

(॥నెలఁ॥)
ముంచినచక్కఁదనాన మోహన రసములుబ్బీ
నించెను కాఁగిటను పన్నీరుబుగ్గలు
యెంచఁగ శ్రీవేంకటేశ యీకె నిట్టె యేలితివి
అంచల నీరతు లోలలాడించవయా

(||pallavi||)
nĕlam̐ta siṁgāramu nī bhāgyamāya
talam̐pu līḍerĕ mīgum̐ dagum̐ dagunayyā

(||nĕlam̐||)
bhāma sanum̐gava nadĕ baṁgāruvānagurisī
temalĕkki movivĕṁṭam̐ denĕgārīni
momunam̐ jaṁdragaḽalu muṁchi kārugammīni
nī momamu tĕppalabai niṁchi teliṁchavayā

(||nĕlam̐||)
mŏnasi sĕlavulanu mutyālabaṁṭalu niṁḍĕ
tanuvuna valabulu dailuvārīni
vŏnarina yārubŏṁta nunnavi vaḽidaraṁgālu
yĕnasĕ nī veḍugalu yīm̐dulāḍiṁchavayā

(||nĕlam̐||)
muṁchinasakkam̐danāna mohana rasamulubbī
niṁchĕnu kām̐giḍanu pannīrubuggalu
yĕṁcham̐ga śhrīveṁkaḍeśha yīgĕ niṭṭĕ yelidivi
aṁchala nīradu lolalāḍiṁchavayā