నెలఁత చెప్పేదెల్లా నిజమాయను
(॥పల్లవి॥)
నెలఁత చెప్పేదెల్లా నిజమాయను
చెలుల మింతే మాకుఁ జెప్పరాదా యిపుడు
(॥నెల॥)
అలసి సొలసి యాపె యానలు వెట్టఁగా నీవు
యెలమిఁ జెవులు మూసుకొనేఁటికిపుడు
మెలఁగి యట్లైతే మేర మీరేవాఁడవే కదా
కలనీగుణములెల్లఁ గానవచ్చెనిపుడు
(॥నెల॥)
చెనకుచు నాపైఁజేతులు చాఁచఁగానే
పెనఁగియేల ముసుఁగు వెట్టుకొనేవు
మనసు రాకిట్లైతే మండాడేవాఁడవే కద
ఘనుఁడవు నీవిద్యలు కానవచ్చెనిపుడు
(॥నెల॥)
కందువ నలమేల్మంగ కాఁగిలించి కూడఁగానే
విందవై శ్రీ వేంకటేశ వెరగందేవు
యిందులోనే యిట్లైతే ఈయకొంటివె కదా
కందులేని నీ మోహము కానవచ్చెనిపుడు
(||pallavi||)
nĕlam̐ta sĕppedĕllā nijamāyanu
sĕlula miṁte māgum̐ jĕpparādā yibuḍu
(||nĕla||)
alasi sŏlasi yābĕ yānalu vĕṭṭam̐gā nīvu
yĕlamim̐ jĕvulu mūsugŏnem̐ṭigibuḍu
mĕlam̐gi yaṭlaide mera mīrevām̐ḍave kadā
kalanīguṇamulĕllam̐ gānavachchĕnibuḍu
(||nĕla||)
sĕnagusu nābaim̐jedulu sām̐sam̐gāne
pĕnam̐giyela musum̐gu vĕṭṭugŏnevu
manasu rāgiṭlaide maṁḍāḍevām̐ḍave kada
ghanum̐ḍavu nīvidyalu kānavachchĕnibuḍu
(||nĕla||)
kaṁduva nalamelmaṁga kām̐giliṁchi kūḍam̐gāne
viṁdavai śhrī veṁkaḍeśha vĕragaṁdevu
yiṁdulone yiṭlaide īyagŏṁṭivĕ kadā
kaṁduleni nī mohamu kānavachchĕnibuḍu