Nelamta sakkamdaname nimdubamdaaramu neegum

నెలఁత చక్కఁదనమే నిండుబండారము నీకుఁ
Language

(॥పల్లవి॥)
నెలఁత చక్కఁదనమే నిండుబండారము నీకుఁ
గలిగెఁ గనకలక్ష్మి కాంతుఁడవైతివి

(॥॥)
పడఁతి నెమ్మోమునకు బంగారుకళలు దేరీ
వెడలేసెలవినవ్వే వెండిగనులు
ఆడియాలమగుమోవి నఁదె పగడపుఁ దీగె
నిడువాలుఁ దురుమే నీలములరాశి

(॥॥)
తరుణిపాదపుగోళ్లు తళువులవజ్రములు
పరుగుఁ జేతిగోళ్లె పద్మరాగాలు
అరిదికన్నుల తేట లాణిముత్తె పుసరులు
సరిఁ బచ్చలకొండలు చనుమొనలు

(॥॥)
చెలితేనెమాటలు జిగిఁ బుష్యరాగాలు
వలపుతెరసిగ్గులు వైడూర్యాలు
తొలఁకుననురాగాలే దొడ్డగోమేధికములు
కలసి తీకెను శ్రీవేంకటేశ కాఁగిటను

(||pallavi||)
nĕlam̐ta sakkam̐daname niṁḍubaṁḍāramu nīgum̐
galigĕm̐ ganagalakṣhmi kāṁtum̐ḍavaidivi

(||||)
paḍam̐ti nĕmmomunagu baṁgārugaḽalu derī
vĕḍalesĕlavinavve vĕṁḍiganulu
āḍiyālamagumovi nam̐dĕ pagaḍabum̐ dīgĕ
niḍuvālum̐ durume nīlamularāśhi

(||||)
taruṇibādabugoḽlu taḽuvulavajramulu
parugum̐ jedigoḽlĕ padmarāgālu
aridigannula teḍa lāṇimuttĕ pusarulu
sarim̐ bachchalagŏṁḍalu sanumŏnalu

(||||)
sĕlidenĕmāḍalu jigim̐ buṣhyarāgālu
valabudĕrasiggulu vaiḍūryālu
tŏlam̐kunanurāgāle dŏḍḍagomedhigamulu
kalasi tīgĕnu śhrīveṁkaḍeśha kām̐giḍanu