(॥పల్లవి॥)
నెలఁత పరభారము నీది కాదా
పలుమారు నిది యాల పచ్చి సేసేవయ్యా
(॥నెలఁత॥)
కొలువులోపల నుండి గొబ్బున మై చమరించి
చెలియ నీమోము చూచి సిగ్గువడెను
వలపు లరసములు వడిసెతే నేమాయ
యెలమి నీ విందు కేల యింత నవ్వేవయ్యా
(॥నెలఁత॥)
నీతో మాటలాడి యాడి నివ్వెరగు నొంది నీపై
చేతినిమ్మపండు వేసి సిగ్గువడెను
కాతరాన నీది నీకుఁ గానికైతే నేమాయ
యీతల నిందుకుఁగాను యేల నవ్వేవయ్యా
(॥నెలఁత॥)
పడిఁ బాదా లొత్తి పరవశమంది నిన్నుఁగూడి
చిడుముడి తెలివొంది సిగ్గువడెను
అడరి పాయపుమద మంతసేసితె నేమాయ
యెడల శ్రీవేంకటేశ యేల నవ్వేవయ్యా
(||pallavi||)
nĕlam̐ta parabhāramu nīdi kādā
palumāru nidi yāla pachchi sesevayyā
(||nĕlam̐ta||)
kŏluvulobala nuṁḍi gŏbbuna mai samariṁchi
sĕliya nīmomu sūsi sigguvaḍĕnu
valabu larasamulu vaḍisĕde nemāya
yĕlami nī viṁdu kela yiṁta navvevayyā
(||nĕlam̐ta||)
nīdo māḍalāḍi yāḍi nivvĕragu nŏṁdi nībai
sedinimmabaṁḍu vesi sigguvaḍĕnu
kādarāna nīdi nīgum̐ gānigaide nemāya
yīdala niṁdugum̐gānu yela navvevayyā
(||nĕlam̐ta||)
paḍim̐ bādā lŏtti paravaśhamaṁdi ninnum̐gūḍi
siḍumuḍi tĕlivŏṁdi sigguvaḍĕnu
aḍari pāyabumada maṁtasesidĕ nemāya
yĕḍala śhrīveṁkaḍeśha yela navvevayyā