నెలఁత నిన్నుఁ జూచితే నిలువు నూరు వండీని
(॥పల్లవి॥)
నెలఁత నిన్నుఁ జూచితే నిలువు నూరు వండీని
యెలమి నీ పుణ్య మిఁక నెంతనఁగ వచ్చునే
(॥॥)
చిత్త మెల్లఁ జిగిరించె చింత లెల్ల నొగిరించె
బత్తి తోడ నింటికి నీ పతి రాఁగాను
హత్తిన తురుము వీడె నంగజ ముద్రలు గూడె
ఇత్తల నీవు సేసిన దెంత భాగ్యమే
(॥॥)
సెలవి నవ్వులు దేరె చెమటలు దైవారె
మలసి యాతఁడు నీతో మాటలాడఁగా
కళలు మోమున మించె కరఁగులు గానిపించె
యెలమి నీ నోమినవో మే మని చెప్పేమే
(॥॥)
చేతికిఁ గౌఁగిలి చిక్కె చెక్కులఁ బులక లెక్కె
యీతల శ్రీ వేంకటేశుఁ డెనయఁ గాను
ఆతని కిదే తావు అలమేల్మంగవు నీవు
నీ తపము నే మెట్టు వర్ణించఁ గలమే
(||pallavi||)
nĕlam̐ta ninnum̐ jūside niluvu nūru vaṁḍīni
yĕlami nī puṇya mim̐ka nĕṁtanam̐ga vachchune
(||||)
sitta mĕllam̐ jigiriṁchĕ siṁta lĕlla nŏgiriṁchĕ
batti toḍa niṁṭigi nī padi rām̐gānu
hattina turumu vīḍĕ naṁgaja mudralu gūḍĕ
ittala nīvu sesina dĕṁta bhāgyame
(||||)
sĕlavi navvulu derĕ sĕmaḍalu daivārĕ
malasi yādam̐ḍu nīdo māḍalāḍam̐gā
kaḽalu momuna miṁchĕ karam̐gulu gānibiṁchĕ
yĕlami nī nominavo me mani sĕppeme
(||||)
sedigim̐ gaum̐gili sikkĕ sĕkkulam̐ bulaga lĕkkĕ
yīdala śhrī veṁkaḍeśhum̐ ḍĕnayam̐ gānu
ādani kide tāvu alamelmaṁgavu nīvu
nī tabamu ne mĕṭṭu varṇiṁcham̐ galame