నెలఁత నేమి చెప్పేవు నిన్నే చెప్పవలెఁ గాక
(॥పల్లవి॥)
నెలఁత నేమి చెప్పేవు నిన్నే చెప్పవలెఁ గాక
తిలకించి ఇటువలె దిద్దుకొన వశమా
(॥నెలఁ॥)
కన్నులనే మాటలాడి కప్పురాన నేసె నిన్ను
కన్నెఁ దెచ్చి యింతకల్కిగాఁ జేసితివి
సన్నల చాయలనే చల్లె వలపులు నీపై
పిన్ననాఁడిని వెన్నతోఁ బెట్టించితివేమో
(॥నెలఁ॥)
వేలనే మెచ్చులు మెచ్చి విరులు నీపై గుప్పె
బాలఁదెచ్చి యింతనేరుపరిఁ జేసితి
వాలిక చూపులు నీపై వంచె నొక్కమాటె నేఁడు
పోలికలు నాఁడె నూరిపోసితివేమో
(॥నెలఁ॥)
పిడికిట విడెమిచ్చి బిగువుఁ జన్నుల నొత్తీ
పడుచుఁ దెచ్చిఁ దిట్టఁగా గడుఁ జేసితి
అడరి శ్రీవేంకటేశ అట్టె నన్నుఁ గూడితివి
బెడఁగుటాన మొలవఁ బెట్టితివేమో
(||pallavi||)
nĕlam̐ta nemi sĕppevu ninne sĕppavalĕm̐ gāga
tilagiṁchi iḍuvalĕ diddugŏna vaśhamā
(||nĕlam̐||)
kannulane māḍalāḍi kappurāna nesĕ ninnu
kannĕm̐ dĕchchi yiṁtagalgigām̐ jesidivi
sannala sāyalane sallĕ valabulu nībai
pinnanām̐ḍini vĕnnadom̐ bĕṭṭiṁchidivemo
(||nĕlam̐||)
velane mĕchchulu mĕchchi virulu nībai guppĕ
bālam̐dĕchchi yiṁtanerubarim̐ jesidi
vāliga sūbulu nībai vaṁchĕ nŏkkamāḍĕ nem̐ḍu
poligalu nām̐ḍĕ nūribosidivemo
(||nĕlam̐||)
piḍigiḍa viḍĕmichchi biguvum̐ jannula nŏttī
paḍusum̐ dĕchchim̐ diṭṭam̐gā gaḍum̐ jesidi
aḍari śhrīveṁkaḍeśha aṭṭĕ nannum̐ gūḍidivi
bĕḍam̐guḍāna mŏlavam̐ bĕṭṭidivemo