Nelamta mohimchinade neramadayyaa

నెలఁత మోహించినదే నేరమటయ్యా
Language

(॥పల్లవి॥)
నెలఁత మోహించినదే నేరమటయ్యా
పలువిన్నపాల కిఁకఁ బనిలేదయ్యా

(॥నెలఁ॥)
చెక్కునఁ జేర్చినచేత సేమంతిరేకులు రాలె
చొక్కపు నీసతి దెస చూడవయ్యా
నిక్కి చూడ నంతలోనే నిలువునఁ గొప్పు వీడె
వెక్కసపుఁజలమేల విచ్చేయవయ్యా

(॥నెలఁ॥)
ముంచినవూర్పులవెంట ముత్యపుఁగన్నీను జారె-
నించుకంత తెమలపు యిదేమయ్యా
చంచలపునడపుల సందడించెఁ జెమటలు
అంచెల నీమనసు కాయటవయ్యా

(॥నెలఁ॥)
పెట్టినపయ్యదలోన బేఁటుగందములు రాలె
చిట్టకాల కింతి నింతసేసితివయ్యా
యిట్టె శ్రీవేంకటేశ యింతి నిట్టె కూడితివి
అట్టె మేను పచ్చి సేతురటవయ్యా

(||pallavi||)
nĕlam̐ta mohiṁchinade neramaḍayyā
paluvinnabāla kim̐kam̐ baniledayyā

(||nĕlam̐||)
sĕkkunam̐ jersinaseda semaṁtiregulu rālĕ
sŏkkabu nīsadi dĕsa sūḍavayyā
nikki sūḍa naṁtalone niluvunam̐ gŏppu vīḍĕ
vĕkkasabum̐jalamela vichcheyavayyā

(||nĕlam̐||)
muṁchinavūrbulavĕṁṭa mutyabum̐gannīnu jārĕ-
niṁchugaṁta tĕmalabu yidemayyā
saṁchalabunaḍabula saṁdaḍiṁchĕm̐ jĕmaḍalu
aṁchĕla nīmanasu kāyaḍavayyā

(||nĕlam̐||)
pĕṭṭinabayyadalona bem̐ṭugaṁdamulu rālĕ
siṭṭagāla kiṁti niṁtasesidivayyā
yiṭṭĕ śhrīveṁkaḍeśha yiṁti niṭṭĕ kūḍidivi
aṭṭĕ menu pachchi seduraḍavayyā