Nelamta meyi komalamu nee sittamu

నెలఁత మెయి కోమలము నీ చిత్తము
Language

(॥పల్లవి॥)
నెలఁత మెయి కోమలము నీ చిత్తము
చెలులము విన్నపము సేయవచ్చు మీకును

(॥నెలఁత॥)
చెక్కులవే చెమరించె శిరసుపూవులు రాలె
పిక్కటిల నీ వాపెతోఁ బెనఁగఁగాను
ముక్కున నూర్పులు రేఁగె మోమున ముంచెఁగళలు
కిక్కిరియఁ గాఁగిలించి గిలిగించఁగాను

(॥నెలఁత॥)
బలిమిఁ జన్ను లదరె పయ్యదకొంగుజారె
నిలువున నీవు గడు నవ్వించఁగాను
నిల్లువెల్లఁ బులకించె నిండుకొనెఁ దమకము
మలసి నీవు మర్మము లంటఁగాను

(॥నెలఁత॥)
కన్నులనుఁ గావిదేరె కరఁగె నిట్టె మనసు
మున్నిటా వేడుకతో నీ వెనయఁగాను
చిన్నలు మేనిపై నిండె శ్రీవేంకటేశ్వర
వున్నతపురతుల నీ వుబ్బించఁగాను

(||pallavi||)
nĕlam̐ta mĕyi komalamu nī sittamu
sĕlulamu vinnabamu seyavachchu mīgunu

(||nĕlam̐ta||)
sĕkkulave sĕmariṁchĕ śhirasubūvulu rālĕ
pikkaḍila nī vābĕdom̐ bĕnam̐gam̐gānu
mukkuna nūrbulu rem̐gĕ momuna muṁchĕm̐gaḽalu
kikkiriyam̐ gām̐giliṁchi giligiṁcham̐gānu

(||nĕlam̐ta||)
balimim̐ jannu ladarĕ payyadagŏṁgujārĕ
niluvuna nīvu gaḍu navviṁcham̐gānu
nilluvĕllam̐ bulagiṁchĕ niṁḍugŏnĕm̐ damagamu
malasi nīvu marmamu laṁṭam̐gānu

(||nĕlam̐ta||)
kannulanum̐ gāviderĕ karam̐gĕ niṭṭĕ manasu
munniḍā veḍugado nī vĕnayam̐gānu
sinnalu menibai niṁḍĕ śhrīveṁkaḍeśhvara
vunnadaburadula nī vubbiṁcham̐gānu