Nelamta jeevanaanagu neeve mamdu

నెలఁత జీవనానకు నీవే మందు
Language

(॥పల్లవి॥)
నెలఁత జీవనానకు నీవే మందు
చెలిమోహపు విభుఁడ చేకొనవయ్యా

(॥సెల॥)
సతిమేనిచిత్తజబాసటము మానుప మాటు
తతితో నీయధరామృతము మందు
సతతము చందురునిశాఖాశైత్యము మాన
రతివేళ తాంబలరసము మందు

(॥సెల॥)
కాంత కెత్తినవాయువుకసరు మానుప మాటు
మంతనాన సరసపుమాటలే మందు
రంతు కెక్క విరహతాపము మాన
కాంతుల నీసోయగపు కనుచూపే మందు

(॥సెల॥)
అంగనకు కర్పూరపారటము మాన మాటు
కంగులేనియిప్పటీనీకాఁగిలే మందు
సంగతి శ్రీ వేంకటేశ సతి నీవుఁ గూడితిరి
చెంగటిమరపులకు చెనకులే మందు

(||pallavi||)
nĕlam̐ta jīvanānagu nīve maṁdu
sĕlimohabu vibhum̐ḍa segŏnavayyā

(||sĕla||)
sadimenisittajabāsaḍamu mānuba māḍu
tadido nīyadharāmṛtamu maṁdu
sadatamu saṁduruniśhākhāśhaityamu māna
radiveḽa tāṁbalarasamu maṁdu

(||sĕla||)
kāṁta kĕttinavāyuvugasaru mānuba māḍu
maṁtanāna sarasabumāḍale maṁdu
raṁtu kĕkka virahadābamu māna
kāṁtula nīsoyagabu kanusūbe maṁdu

(||sĕla||)
aṁganagu karbūrabāraḍamu māna māḍu
kaṁguleniyippaḍīnīgām̐gile maṁdu
saṁgadi śhrī veṁkaḍeśha sadi nīvum̐ gūḍidiri
sĕṁgaḍimarabulagu sĕnagule maṁdu