Nelamta bhaagya mimka neesedidi

నెలఁత భాగ్య మిఁక నీచేతిది
Language

(॥పల్లవి॥)
నెలఁత భాగ్య మిఁక నీచేతిది
తొలఁకీ సిరులు నీవు తొంగిచూచినపుడే

(॥నెలఁ॥)
తరుణికి నీవలపు దాకొన్నతలపోఁత
మరుగుటే నీమంచిమరులూ
తొరలినమోపులదోమటి పెనువిందు
నిరతితో గుఱుతాయ నీవు ముట్టితేనే

(॥నెలఁ॥)
మగువకు నీతో నవ్వు మానరానితరితీపు
వగయెఱఁగని విడువనిజోలి
తగువైనమంచితెల్లఁదామరపూవులపూజ
అగపడె నీ వీకె నాయమంటినపుడే

(॥నెలఁ॥)
సతికి నీకూటమి సారె నాగవల్లిపెండ్లి
మతకపురతులకు మాననిజిడ్డు
తతి శ్రీవేంకటేశ్వర దక్కినరత్నాలసొమ్ము
జితమాయ నీవిపుడు చేకొనేలినపుడే

(||pallavi||)
nĕlam̐ta bhāgya mim̐ka nīsedidi
tŏlam̐kī sirulu nīvu tŏṁgisūsinabuḍe

(||nĕlam̐||)
taruṇigi nīvalabu dāgŏnnadalabom̐ta
maruguḍe nīmaṁchimarulū
tŏralinamobuladomaḍi pĕnuviṁdu
niradido guṟudāya nīvu muṭṭidene

(||nĕlam̐||)
maguvagu nīdo navvu mānarānidaridību
vagayĕṟam̐gani viḍuvanijoli
taguvainamaṁchidĕllam̐dāmarabūvulabūja
agabaḍĕ nī vīgĕ nāyamaṁṭinabuḍe

(||nĕlam̐||)
sadigi nīgūḍami sārĕ nāgavallibĕṁḍli
madagaburadulagu mānanijiḍḍu
tadi śhrīveṁkaḍeśhvara dakkinaratnālasŏmmu
jidamāya nīvibuḍu segŏnelinabuḍe