Nelamkim baasi vumdalenu nimisha memdu nemdu naagu

నెలఁకిఁ బాసి వుండలేను నిమిష మెందు నేఁడు నాకు
Language

(॥పల్లవి॥)
నెలఁకిఁ బాసి వుండలేను నిమిష మెందు నేఁడు నాకు
తలఁపులో నీ వలెనే రతుల తరుణిఁ గలయు టెన్నఁడే

(॥నెల॥)
ముదిత నాయెదుట నిలిచి మోసులువార నవ్వునవ్వి
కదలుఁజూపులఁ జూచి నాకు కన్ను లార్చు టెన్నఁడే
వదలుఁబయ్యద సవదరించి వలపుతేట చవులు చూపి
కొదలు మాటల ముద్దు గునిసి కూరిమి గొసరు టెన్నఁడే

(॥నెల॥)
చెలియ సిగ్గున మోము వంచి చెక్కునఁజేయి మాటు సేసి
మలసి వీడె మిచ్చి ఆకు మడిచి యిచ్చు టెన్నఁడే
వలుద చన్ను లురము మోఁప వాసన యూర్పు చల్లిచల్లి
కలయ మోవితేనె లొఁసగు కంచము పొత్తు లెన్నఁడే

(॥నెల॥)
యింతి నన్నుఁ జేరఁ బిలిచి యింటిలోని పరపు మీఁద
దొంతికళలు రేఁగ నంటి దొమ్మి సేయు టెన్నఁడే
వింత లేక యిపుడె శ్రీ వేంకటేశ్వరుఁడనైన
పొంతనున్న నన్నుఁ గూడ పొద్దు దెలియు టెన్నఁడే

(||pallavi||)
nĕlam̐kim̐ bāsi vuṁḍalenu nimiṣha mĕṁdu nem̐ḍu nāgu
talam̐pulo nī valĕne radula taruṇim̐ galayu ṭĕnnam̐ḍe

(||nĕla||)
mudida nāyĕduḍa nilisi mosuluvāra navvunavvi
kadalum̐jūbulam̐ jūsi nāgu kannu lārsu ṭĕnnam̐ḍe
vadalum̐bayyada savadariṁchi valabudeḍa savulu sūbi
kŏdalu māḍala muddu gunisi kūrimi gŏsaru ṭĕnnam̐ḍe

(||nĕla||)
sĕliya sigguna momu vaṁchi sĕkkunam̐jeyi māḍu sesi
malasi vīḍĕ michchi āgu maḍisi yichchu ṭĕnnam̐ḍe
valuda sannu luramu mom̐pa vāsana yūrbu sallisalli
kalaya movidenĕ lŏm̐sagu kaṁchamu pŏttu lĕnnam̐ḍe

(||nĕla||)
yiṁti nannum̐ jeram̐ bilisi yiṁṭiloni parabu mīm̐da
dŏṁtigaḽalu rem̐ga naṁṭi dŏmmi seyu ṭĕnnam̐ḍe
viṁta lega yibuḍĕ śhrī veṁkaḍeśhvarum̐ḍanaina
pŏṁtanunna nannum̐ gūḍa pŏddu dĕliyu ṭĕnnam̐ḍe