Nelaminnu nokkadaina neebamtu vokka

నేలమిన్ను నొక్కటైన నీబంటు వొక్క
Language

(॥పల్లవి॥)
నేలమిన్ను నొక్కటైన నీబంటు వొక్క-
వేలనే యక్షునిఁ దెగవేసెఁగా నీ బంటు

(॥నేలమిన్ను॥)
ఉంగరమెగరవేసి యుదధిలోఁ బడకుండ
నింగికిఁ జెయిచాఁచె నీబంటు
చంగున జలధిదాఁటి జంబుమాలి నిలమీఁద
కుంగఁదొక్కి పదములఁ గుమ్మెఁగా నీబంటు

(॥నేలమిన్ను॥)
వెట్టగా రావణు రొమ్మువిరుగఁ జేతనే గుద్దె
నిట్టతాడువంటివాఁడు నీబంటు
దిట్టయై మందులకొండ తేజమున నడురేయి
పట్టపగలుగఁ దెచ్చె బాపురే నీబంటు

(॥నేలమిన్ను॥)
అలర నన్నియుఁ జేసి అజునిపట్టానకు
నిలుచున్నాఁ డదివో నీబంటు
బలువేంకటేశ ఈ పవననందనుఁడు
కలిగి లోకములెల్లఁ గాచెఁగా నీబంటు

(||pallavi||)
nelaminnu nŏkkaḍaina nībaṁṭu vŏkka-
velane yakṣhunim̐ dĕgavesĕm̐gā nī baṁṭu

(||nelaminnu||)
uṁgaramĕgaravesi yudadhilom̐ baḍaguṁḍa
niṁgigim̐ jĕyisām̐sĕ nībaṁṭu
saṁguna jaladhidām̐ṭi jaṁbumāli nilamīm̐da
kuṁgam̐dŏkki padamulam̐ gummĕm̐gā nībaṁṭu

(||nelaminnu||)
vĕṭṭagā rāvaṇu rŏmmuvirugam̐ jedane guddĕ
niṭṭadāḍuvaṁṭivām̐ḍu nībaṁṭu
diṭṭayai maṁdulagŏṁḍa tejamuna naḍureyi
paṭṭabagalugam̐ dĕchchĕ bābure nībaṁṭu

(||nelaminnu||)
alara nanniyum̐ jesi ajunibaṭṭānagu
nilusunnām̐ ḍadivo nībaṁṭu
baluveṁkaḍeśha ī pavananaṁdanum̐ḍu
kaligi logamulĕllam̐ gāsĕm̐gā nībaṁṭu