నీయంతవట్టుకు నీవు నెరవాదివి
(॥పల్లవి॥)
నీయంతవట్టుకు నీవు నెరవాదివి
పాయపు సతుల మేనిబడలి కెఱఁగవు
(॥నీయం॥)
తగవు జెప్ప జాణవు తరుణులకై తేను
యెగసక్కెపునీచేఁత లెంచుకొనవు
మొగము చూచితే నీకు మోనినే నవ్వులు వచ్చు
అగడైనకాంతలు అలసే దెఱఁగవు
(॥నీయం॥)
అందాలు సేయనేర్తువు అంగనలమాటఁలు
విందుల నీసుద్దులైతే విచారించవు
చెంది నీకు మొక్కి తేను సిగ్గులు పైపైనే వుండు
కందువ చెలులలోనికాఁక నీవెఱఁగవు
(॥నీయం॥)
వొక్కటి సేయనోపుదు వొరటైనసవతుల
తక్కరి శ్రీవేంకటేశ తరి యెంచవు
మిక్కిలి కూడితే నలమేల్మంగనని చొక్కేవు
దక్కినట్టివనితలతచ్చన లెఱఁగవు
(||pallavi||)
nīyaṁtavaṭṭugu nīvu nĕravādivi
pāyabu sadula menibaḍali kĕṟam̐gavu
(||nīyaṁ||)
tagavu jĕppa jāṇavu taruṇulagai tenu
yĕgasakkĕbunīsem̐ta lĕṁchugŏnavu
mŏgamu sūside nīgu monine navvulu vachchu
agaḍainagāṁtalu alase dĕṟam̐gavu
(||nīyaṁ||)
aṁdālu seyanerduvu aṁganalamāḍam̐lu
viṁdula nīsuddulaide visāriṁchavu
sĕṁdi nīgu mŏkki tenu siggulu paibaine vuṁḍu
kaṁduva sĕlulalonigām̐ka nīvĕṟam̐gavu
(||nīyaṁ||)
vŏkkaḍi seyanobudu vŏraḍainasavadula
takkari śhrīveṁkaḍeśha tari yĕṁchavu
mikkili kūḍide nalamelmaṁganani sŏkkevu
dakkinaṭṭivanidaladachchana lĕṟam̐gavu