నీయంతవారమా నేము నెట్టుక నవ్వులు నవ్వ
(॥పల్లవి॥)
నీయంతవారమా నేము నెట్టుక నవ్వులు నవ్వ
యీ యెడ నీవు మన్నించే ఇంతులము నేము
(॥నీయంత॥)
గోర గీరితే వలపు కొండలుఁ గోట్లు నగును
నేరుతుమా నీవంటి నేరుపులు
బార చాఁచితే నీకు పదివేగురు చుట్టాలు
ఆరీతివారమా నీఇల్లాండ్లము నేము
(॥నీయంత॥)
చూచితే నందరియాస సంకులు మోపు నీమీఁద
మాచేత నింతేసి పని మట్టుపడునా
కాచితే నీననుపులు కాయలుఁ బండ్లు నౌను
లాచేటివారమా నీలలనలము
(॥నీయంత॥)
మాటాడి నంతటిలోన మర్మములెల్లఁ గరఁగు
సూటిఁబడీనా మాకిట్టే సులభానను
గాఁటాన శ్రీవేంకటేశ కలసితివిటు నన్ను
దీఁటు వెట్టుకొనేమానీ దేవుళ్లము
(||pallavi||)
nīyaṁtavāramā nemu nĕṭṭuga navvulu navva
yī yĕḍa nīvu manniṁche iṁtulamu nemu
(||nīyaṁta||)
gora gīride valabu kŏṁḍalum̐ goṭlu nagunu
nerudumā nīvaṁṭi nerubulu
bāra sām̐side nīgu padiveguru suṭṭālu
ārīdivāramā nīillāṁḍlamu nemu
(||nīyaṁta||)
sūside naṁdariyāsa saṁkulu mobu nīmīm̐da
māseda niṁtesi pani maṭṭubaḍunā
kāside nīnanubulu kāyalum̐ baṁḍlu naunu
lāseḍivāramā nīlalanalamu
(||nīyaṁta||)
māḍāḍi naṁtaḍilona marmamulĕllam̐ garam̐gu
sūḍim̐baḍīnā māgiṭṭe sulabhānanu
gām̐ṭāna śhrīveṁkaḍeśha kalasidiviḍu nannu
dīm̐ṭu vĕṭṭugŏnemānī devuḽlamu