నీయంతవారమా నీవార మింతేకాక
(॥పల్లవి॥)
నీయంతవారమా నీవార మింతేకాక
నాయమాడేవారమా నమ్మేవారముగాక
(॥నీయం॥)
మారుకొని నేము నీతో మాటలాడేవారమా
వైరము లేకుండఁ దిట్టేవారముగాక
చేరి నీమేను నొవ్వ చెనకేటివారమా
నారుకొన గోరుసోఁక నవ్వేవారముగాక
(॥నీయం॥)
సరికిబేసికి నీతో జగడాలవారమా
వరుసెరిఁగి జంకించేవారముగాక
పరిపరివిధముల పగచాటేవారమా
గొరబుగా కొంగువట్టుకొనేవారముగాక
(॥నీయం॥)
బలిమిఁ గాఁగిట నన్నుఁ బబ్టుకొనేవారమా
వలపించి లోలోఁ గూడేవారముగాక
కలసితి వీడ శ్రీవేంకటేశ్వరుఁడ నన్ను
పిలిచేటివారమా ప్రేమవారముగాక
(||pallavi||)
nīyaṁtavāramā nīvāra miṁtegāga
nāyamāḍevāramā nammevāramugāga
(||nīyaṁ||)
mārugŏni nemu nīdo māḍalāḍevāramā
vairamu leguṁḍam̐ diṭṭevāramugāga
seri nīmenu nŏvva sĕnageḍivāramā
nārugŏna gorusom̐ka navvevāramugāga
(||nīyaṁ||)
sarigibesigi nīdo jagaḍālavāramā
varusĕrim̐gi jaṁkiṁchevāramugāga
paribarividhamula pagasāḍevāramā
gŏrabugā kŏṁguvaṭṭugŏnevāramugāga
(||nīyaṁ||)
balimim̐ gām̐giḍa nannum̐ babṭugŏnevāramā
valabiṁchi lolom̐ gūḍevāramugāga
kalasidi vīḍa śhrīveṁkaḍeśhvarum̐ḍa nannu
piliseḍivāramā premavāramugāga