Neeyamta vattugu melu nemmi niruvamkalaanu

నీయంత వట్టుకు మేలు నెమ్మి నిరువంకలాను
Language

(॥పల్లవి॥)
నీయంత వట్టుకు మేలు నెమ్మి నిరువంకలాను
పాయము నెఁ(నెం?)జెరువులు భామలిద్దరికి

(॥నీయంత॥)
వొట్టి తన మగఁడంటా వొడివట్టె నిన్నొకతె
చెట్టవట్టి తీసీని చేరి యొకతె
పొట్టఁ బొరుగున వలపులు తీపులఁబడె
చుట్టమ వెప్పుడు నీవు సుదతు లిద్దరికి

(॥నీయంత॥)
వేడుకకాడవంటా విందువెట్టె నీకొకతె
వాడికెకు వీడెమిచ్చె వడి నొకతె
ఆడికెకు నడుమ నందతుకులాయఁ బ్రియాలు
కూడేటి నిధానమవు కొమ్మలకిద్దరికి

(॥నీయంత॥)
మేనవాఁడవంటాఁ దాను మెచ్చి కూడె ని న్నొకతె
వూని కాఁగిలించుకొనె పొంచి యెకతె
నేను నీవుఁ గూడఁగాను నేరపు నాపాలఁ జిక్కె
వూని శ్రీవేంకటేశుఁడ వువిదలిద్దరికి

(||pallavi||)
nīyaṁta vaṭṭugu melu nĕmmi niruvaṁkalānu
pāyamu nĕm̐(nĕṁ?)jĕruvulu bhāmaliddarigi

(||nīyaṁta||)
vŏṭṭi tana magam̐ḍaṁṭā vŏḍivaṭṭĕ ninnŏgadĕ
sĕṭṭavaṭṭi tīsīni seri yŏgadĕ
pŏṭṭam̐ bŏruguna valabulu tībulam̐baḍĕ
suṭṭama vĕppuḍu nīvu sudadu liddarigi

(||nīyaṁta||)
veḍugagāḍavaṁṭā viṁduvĕṭṭĕ nīgŏgadĕ
vāḍigĕgu vīḍĕmichchĕ vaḍi nŏgadĕ
āḍigĕgu naḍuma naṁdadugulāyam̐ briyālu
kūḍeḍi nidhānamavu kŏmmalagiddarigi

(||nīyaṁta||)
menavām̐ḍavaṁṭām̐ dānu mĕchchi kūḍĕ ni nnŏgadĕ
vūni kām̐giliṁchugŏnĕ pŏṁchi yĕgadĕ
nenu nīvum̐ gūḍam̐gānu nerabu nābālam̐ jikkĕ
vūni śhrīveṁkaḍeśhum̐ḍa vuvidaliddarigi