నీయంత నెఱఁగవు నేఁటిదాఁకాను
(॥పల్లవి॥)
నీయంత నెఱఁగవు నేఁటిదాఁకాను
మాయలెల్లా నీకు నే మగువ నేరిపెరా
(॥నీయం॥)
పలుమారు నవ్వుమని పడఁతులఁ దిట్టుమని
చెలఁగి యవ్వతె బుద్దిచెప్పెరా నీకు
చలము సాదించుమని సటలెల్లాఁ జేయుమని
నిలుకడగా నెంతనేరిపెరా నీకు
(॥నీయం॥)
వొద్దనే కూచుండుమని వొడివట్టి తియ్యుమని
తిద్ది యెవ్వతె బోదించెరా నీకు
కొద్దిమీరి వుండుమని గుఱుతులు సేయుమని
గద్దరితన మేగతిఁ గట్టెరా నీకు
(॥నీయం॥)
పంతగాఁడవు గమ్మని పైపై నిచ్చలాడుమని
కాంత యెవ్వతె పట్టముగట్టెరా నీకు
యింతో శ్రీవేంకటేశ యిటు నన్నుఁ గూడితివి
బంతినే యీగుణ మెట్టు పట్టించెరా నీకు
(||pallavi||)
nīyaṁta nĕṟam̐gavu nem̐ṭidām̐kānu
māyalĕllā nīgu ne maguva neribĕrā
(||nīyaṁ||)
palumāru navvumani paḍam̐tulam̐ diṭṭumani
sĕlam̐gi yavvadĕ buddisĕppĕrā nīgu
salamu sādiṁchumani saḍalĕllām̐ jeyumani
nilugaḍagā nĕṁtaneribĕrā nīgu
(||nīyaṁ||)
vŏddane kūsuṁḍumani vŏḍivaṭṭi tiyyumani
tiddi yĕvvadĕ bodiṁchĕrā nīgu
kŏddimīri vuṁḍumani guṟudulu seyumani
gaddaridana megadim̐ gaṭṭĕrā nīgu
(||nīyaṁ||)
paṁtagām̐ḍavu gammani paibai nichchalāḍumani
kāṁta yĕvvadĕ paṭṭamugaṭṭĕrā nīgu
yiṁto śhrīveṁkaḍeśha yiḍu nannum̐ gūḍidivi
baṁtine yīguṇa mĕṭṭu paṭṭiṁchĕrā nīgu