Neeyamta neṟamgagunna nenainaam jeppe neegu

నీయంత నెఱఁగకున్న నేనైనాఁ జెప్పే నీకు
Language

(॥పల్లవి॥)
నీయంత నెఱఁగకున్న నేనైనాఁ జెప్పే నీకు
పాయపువాఁడవు గాన పరాకెంతో నీకు

(॥నీయం॥)
కరఁగిజారినయట్టికస్తురి బొట్టు చెలికి
సరుగ దిద్దుతాను ముచ్చటలాడేవు
సరిఁ జెఱుఁగువట్టుక సతులెందరో వున్నారు
పరగ వారిఁ జూడవు పరాకెంతో నీకు

(॥నీయం॥)
యెక్కువై తడఁబడినఇంతికంఠమాలికలు
చిక్కులు దీసుకొంటాను చిత్తగించేవు
మొక్కులు నీకు మొక్కుతా ముందరనున్నా రెందరో
ఫక్కనవారిఁ జూడవు పరాకెంతో నీకు

(॥నీయం॥)
సుదతిఁ గాఁగిటఁ గూడి సురటి విసరుకొంటా
వుదుటై శ్రీవేంకటేశ వున్నాఁడవు
పదిమారులును నీకుఁ బాదాలు విసికేవారి-
పదనుకాంక్ష చూడవు పరాకెంతో నీకు

(||pallavi||)
nīyaṁta nĕṟam̐gagunna nenainām̐ jĕppe nīgu
pāyabuvām̐ḍavu gāna parāgĕṁto nīgu

(||nīyaṁ||)
karam̐gijārinayaṭṭigasturi bŏṭṭu sĕligi
saruga diddudānu muchchaḍalāḍevu
sarim̐ jĕṟum̐guvaṭṭuga sadulĕṁdaro vunnāru
paraga vārim̐ jūḍavu parāgĕṁto nīgu

(||nīyaṁ||)
yĕkkuvai taḍam̐baḍina̮iṁtigaṁṭhamāligalu
sikkulu dīsugŏṁṭānu sittagiṁchevu
mŏkkulu nīgu mŏkkudā muṁdaranunnā rĕṁdaro
phakkanavārim̐ jūḍavu parāgĕṁto nīgu

(||nīyaṁ||)
sudadim̐ gām̐giḍam̐ gūḍi suraḍi visarugŏṁṭā
vuduḍai śhrīveṁkaḍeśha vunnām̐ḍavu
padimārulunu nīgum̐ bādālu visigevāri-
padanugāṁkṣha sūḍavu parāgĕṁto nīgu