నీయంత నీవెఱిఁగి మన్నింతువుగాక మమ్ము
(॥పల్లవి॥)
నీయంత నీవెఱిఁగి మన్నింతువుగాక మమ్ము
దాయగానివలె బొంకఁదగునా నీకు
(॥నీయం॥)
తేరినపనులకు తియ్యనిమోవులకు
దారదప్పక నవ్వేవు తగునా నీకు
నేరుపరిచేఁతలెల్లా నీమేన నుండఁగానే
తారుకాణించవచ్చేవు తగునా నీకు
(॥నీయం॥)
కప్పురపుమాటలకు గట్టియైనచన్నులకు
తప్పకచూచే విట్టే తగునా నీకు
కుప్పళించి నీసతులు కొలువులో నుండఁగాను
తప్పక ఆనవెట్టేవు తగునా నీకు
(॥నీయం॥)
పొగరుమాకళలకు భోగించేమానేర్పులకు
తగిలి మమ్ము మెచ్చేవు తగునా నీకు
నిగిడి శ్రీ వేంకటేశ నీవే నన్నుఁ గలసితి
దగదొట్టి అలసేవు తగునా నీకు
(||pallavi||)
nīyaṁta nīvĕṟim̐gi manniṁtuvugāga mammu
dāyagānivalĕ bŏṁkam̐dagunā nīgu
(||nīyaṁ||)
terinabanulagu tiyyanimovulagu
dāradappaga navvevu tagunā nīgu
nerubarisem̐talĕllā nīmena nuṁḍam̐gāne
tārugāṇiṁchavachchevu tagunā nīgu
(||nīyaṁ||)
kappurabumāḍalagu gaṭṭiyainasannulagu
tappagasūse viṭṭe tagunā nīgu
kuppaḽiṁchi nīsadulu kŏluvulo nuṁḍam̐gānu
tappaga ānavĕṭṭevu tagunā nīgu
(||nīyaṁ||)
pŏgarumāgaḽalagu bhogiṁchemānerbulagu
tagili mammu mĕchchevu tagunā nīgu
nigiḍi śhrī veṁkaḍeśha nīve nannum̐ galasidi
dagadŏṭṭi alasevu tagunā nīgu