Neeyamta neeveṟamgavu nenadi vinnavimchidi

నీయంత నీవెఱఁగవు నేనది విన్నవించితి
Language

(॥పల్లవి॥)
నీయంత నీవెఱఁగవు నేనది విన్నవించితి
చేయి మీఁదాయెను నా చెక్కులు నొక్కకుమీ

(॥నీయ॥)
పిలువకు సారెసారె పేరుకొని నన్ను నీవు
వలపు పేరడిఁబడీ వద్దు నవ్వకు
బలిమిసేసి నీవు వట్టకు నాకుచములు
కొలఁదిఁబడదు కొనగో రంటించకుమీ

(॥నీయ॥)
తప్పక చూడకు నీవు తమకపుచూపుల
కుప్పలువడీ సిగ్గులు కొంగువట్టకు
కొప్పు జారీ నీవు నన్ను కూరుములు గొసరక
దప్పిదేరీ మోవి నిదే దంట మాటాడకుమీ

(॥నీయ॥)
వొడివట్ట కంత నీవు వూరకే దగ్గరి వచ్చి
తడఁబడీ మానములు తతిగొనకు
అడరి శ్రీవేంకటేశ యలమేల్మంగను నేను
యెడయక కూడితి ఇట్టె మరవకుమీ

(||pallavi||)
nīyaṁta nīvĕṟam̐gavu nenadi vinnaviṁchidi
seyi mīm̐dāyĕnu nā sĕkkulu nŏkkagumī

(||nīya||)
piluvagu sārĕsārĕ perugŏni nannu nīvu
valabu peraḍim̐baḍī vaddu navvagu
balimisesi nīvu vaṭṭagu nāgusamulu
kŏlam̐dim̐baḍadu kŏnago raṁṭiṁchagumī

(||nīya||)
tappaga sūḍagu nīvu tamagabusūbula
kuppaluvaḍī siggulu kŏṁguvaṭṭagu
kŏppu jārī nīvu nannu kūrumulu gŏsaraga
dappiderī movi nide daṁṭa māḍāḍagumī

(||nīya||)
vŏḍivaṭṭa kaṁta nīvu vūrage daggari vachchi
taḍam̐baḍī mānamulu tadigŏnagu
aḍari śhrīveṁkaḍeśha yalamelmaṁganu nenu
yĕḍayaga kūḍidi iṭṭĕ maravagumī