నీయంత నీ వెఱఁగవు నేనా చెప్పితిఁ జుమ్మీ
(॥పల్లవి॥)
నీయంత నీ వెఱఁగవు నేనా చెప్పితిఁ జుమ్మీ
చేయి సేసుకోఁ జాలక సిగ్గున నున్నదానను
(॥॥)
ముట్టి నఁ గందేటిమేను మొనవేలు దాఁ క నీకు
మట్టుతో నల్లంత నుండే వటాడరాదా
నెట్టన నాకుచములు నీ కంటేవాండ్లు సుమ్మీ
వొట్టి నే నంత సేయక వూరకున్న దానను
(॥॥)
నెఱిఁ బులకచెక్కులు నీ చెక్కులు సోఁ క నీకు
గుఱిగా సంగడి నిట్టే కూచుండరాదా
తఱి నాచూపు నీగుండె తమిఁ గరఁగించుఁ జుమ్మీ
మెఱమెచ్చులకు మితిమీరక వున్నదానను
(॥॥)
వోవిపైఁ బలుసోఁ కులు మోపకు నీవంత మమ్ము
యీవేళ నన్నుఁ గూడితి వింత చాలదా
చేవ మాచేఁతలు నిట్టెఁ జిగుళ్ళై నిలుచుఁ జుమ్మీ
శ్రీవేంకటేశుఁడ ముందే చేకొనే ఉన్నదానను.
(||pallavi||)
nīyaṁta nī vĕṟam̐gavu nenā sĕppidim̐ jummī
seyi sesugom̐ jālaga sigguna nunnadānanu
(||||)
muṭṭi nam̐ gaṁdeḍimenu mŏnavelu dām̐ ka nīgu
maṭṭudo nallaṁta nuṁḍe vaḍāḍarādā
nĕṭṭana nāgusamulu nī kaṁṭevāṁḍlu summī
vŏṭṭi ne naṁta seyaga vūragunna dānanu
(||||)
nĕṟim̐ bulagasĕkkulu nī sĕkkulu som̐ ka nīgu
guṟigā saṁgaḍi niṭṭe kūsuṁḍarādā
taṟi nāsūbu nīguṁḍĕ tamim̐ garam̐giṁchum̐ jummī
mĕṟamĕchchulagu midimīraga vunnadānanu
(||||)
vovibaim̐ balusom̐ kulu mobagu nīvaṁta mammu
yīveḽa nannum̐ gūḍidi viṁta sāladā
seva māsem̐talu niṭṭĕm̐ jiguḽḽai nilusum̐ jummī
śhrīveṁkaḍeśhum̐ḍa muṁde segŏne unnadānanu.