నీయందు నేమైనా నెరసు లెంచితిమా
(॥పల్లవి॥)
నీయందు నేమైనా నెరసు లెంచితిమా
చేయెత్తి మొక్కితేనేల సిగ్గుపడేవు
(॥॥)
మంతనాన నిద్దరము మాటలాడుకొంటేను
అంతలోఁ బెట్టుకొనేవు ఆనలు నీవు
సంతోసాన నీమోము సారె సారెఁ జూచితేను
యెంతకెంత నీవేల యెగ్గుపట్టేవు
(॥॥)
జవ్వనులము మాలోనే సన్నలు సేసుకొంటేను
యివ్వల సుద్దులు మమ్ము నేలడిగేవు
వువ్విళ్లూర నీమేనంటి వూడిగాలు సేసితేను
చువ్వన నీవెంత మాకు సోదనిచ్చేవు
(॥॥)
కొమ్మల నిందరిని కొలువుకుఁ బిలిచితే
కమ్మి యెంత మమ్ము నిట్దె కాఁగిలించేవు
యిమ్ముల శ్రీవేంకటేశ యెనసితి విన్నిటాను
తెమ్మలుగా మమ్ము నేమి తెలుపవచ్చేవు
(||pallavi||)
nīyaṁdu nemainā nĕrasu lĕṁchidimā
seyĕtti mŏkkidenela siggubaḍevu
(||||)
maṁtanāna niddaramu māḍalāḍugŏṁṭenu
aṁtalom̐ bĕṭṭugŏnevu ānalu nīvu
saṁtosāna nīmomu sārĕ sārĕm̐ jūsidenu
yĕṁtagĕṁta nīvela yĕggubaṭṭevu
(||||)
javvanulamu mālone sannalu sesugŏṁṭenu
yivvala suddulu mammu nelaḍigevu
vuvviḽlūra nīmenaṁṭi vūḍigālu sesidenu
suvvana nīvĕṁta māgu sodanichchevu
(||||)
kŏmmala niṁdarini kŏluvugum̐ biliside
kammi yĕṁta mammu niṭdĕ kām̐giliṁchevu
yimmula śhrīveṁkaḍeśha yĕnasidi vinniḍānu
tĕmmalugā mammu nemi tĕlubavachchevu