నీయందు కడమా నిండుదొరవు నీవు యీ
(॥పల్లవి॥)
నీయందు కడమా నిండుదొరవు నీవు యీ-
నాయము లోకపు నడవడే కదరా
(॥నీయం॥)
సగము చీఁకటియు సగము వెలుంగును
జిగి యొకదినమునఁ జెలఁగీనటా
నిగిడి నీగుణములు నిజమును కల్లయు
వొగి నీకుఁ గలుగు టుచితమేకదరా
(॥నీయం॥)
చేఁదు కాఁకరను చెరకునఁ దీపును
పోదితో నిట్టే పొడమీనటా
నేదల మతి నొలసియు నొల్లమియును
యీదెస నీకిది ఇటు దగుఁగదరా
(॥నీయం॥)
శ్రీవేంకటేశ్వర చిగురును చేఁగయు
వోపల నొకమాన నుండీనటా
నీవల వినయము నిటు రాజసముఁ
దావాయ నీరతిఁ దగుఁదగుఁ బదరా
(||pallavi||)
nīyaṁdu kaḍamā niṁḍudŏravu nīvu yī-
nāyamu logabu naḍavaḍe kadarā
(||nīyaṁ||)
sagamu sīm̐kaḍiyu sagamu vĕluṁgunu
jigi yŏgadinamunam̐ jĕlam̐gīnaḍā
nigiḍi nīguṇamulu nijamunu kallayu
vŏgi nīgum̐ galugu ṭusidamegadarā
(||nīyaṁ||)
sem̐du kām̐karanu sĕragunam̐ dībunu
podido niṭṭe pŏḍamīnaḍā
nedala madi nŏlasiyu nŏllamiyunu
yīdĕsa nīgidi iḍu dagum̐gadarā
(||nīyaṁ||)
śhrīveṁkaḍeśhvara sigurunu sem̐gayu
vobala nŏgamāna nuṁḍīnaḍā
nīvala vinayamu niḍu rājasamum̐
dāvāya nīradim̐ dagum̐dagum̐ badarā