Neevu virahi vavuda ne neramganaa

నీవు విరహి వవుట నే నెరఁగనా
Language

(॥పల్లవి॥)
నీవు విరహి వవుట నే నెరఁగనా
భావించ యెవ్వ రవుతా నేర్పరచలేఁ గాని

(॥నీవు॥)
కాఁకలు నీ మాటలోనె కాన రాదా నీ మేను
సోఁకించి నా కప్పటిని చూప వలెనా
యేఁకట నాకయిన దిన్ని యెవ్వతెకు నీ వైనది
తేఁకువ నీ రెండూను తెలియలేఁ గాని

(॥నీవు॥)
కరఁగులు నీ మోము కళలోనె కాన రాదా
ఆర మరిచితి నంటా నాడవలెనా
ధర నిది నా కవుత తగ వేరొకతె కవుత
యిరవుగ నిది నిశ్యయించలేఁ గాని

(॥నీవు॥)
కూటమి నీ కాఁగిటితో గురి సేయవలెనా నీ
తేటలు ప్రియాలలోనె ద్రిష్టము గాదా
మేఁటివి శ్రీవెంకటేశ మించి నన్నుఁ గూడితివి
యాఁటదాటిపొందవుత అరయలేఁ గాని

(||pallavi||)
nīvu virahi vavuḍa ne nĕram̐ganā
bhāviṁcha yĕvva ravudā nerbarasalem̐ gāni

(||nīvu||)
kām̐kalu nī māḍalonĕ kāna rādā nī menu
som̐kiṁchi nā kappaḍini sūba valĕnā
yem̐kaḍa nāgayina dinni yĕvvadĕgu nī vainadi
tem̐kuva nī rĕṁḍūnu tĕliyalem̐ gāni

(||nīvu||)
karam̐gulu nī momu kaḽalonĕ kāna rādā
āra marisidi naṁṭā nāḍavalĕnā
dhara nidi nā kavuda taga verŏgadĕ kavuda
yiravuga nidi niśhyayiṁchalem̐ gāni

(||nīvu||)
kūḍami nī kām̐giḍido guri seyavalĕnā nī
teḍalu priyālalonĕ driṣhṭamu gādā
mem̐ṭivi śhrīvĕṁkaḍeśha miṁchi nannum̐ gūḍidivi
yām̐ṭadāḍibŏṁdavuda arayalem̐ gāni