Neevu sesinasemtalu nemdu maameemda nunnavi

నీవు సేసినచేఁతలు నేఁడు మామీఁద నున్నవి
Language

(॥పల్లవి॥)
నీవు సేసినచేఁతలు నేఁడు మామీఁద నున్నవి
యీవల నప్పటి మమ్మునేల దూరేవు

(॥నీవు॥)
పెదవిపై కెంపులు బిగువులు వట్టుండఁగా
యెదురుమాటలు నీతో నేఁటి కాడేము
కడలుఁ గన్నుల నిద్ర కడుఁ గమ్ముకొనఁగాను
ఇదివో నిన్నుఁ గసరి యేలచూచేము

(॥నీవు॥)
పట్టఁగానే గరివడి పాలిండ్లు వుండఁగాను
బెట్టి యేలపెనఁగేము బీరాన నీతో
గుట్టున జెమట మడుగులు గట్టుకొనఁగాను
జట్టిగొని ఇంకా నెంత సరసమాడేము

(॥నీవు॥)
సిగ్గువడ్డచిత్తము చిమ్మిరేఁగి వుండఁగాను
వొగ్గిరతులకు నెట్టు వొడిగట్టేము
నిగ్గులశ్రీవేంకటేశ నే నలమేలుమంగను
యెగ్గులేక కూడితివి యెంత మెచ్చేము

(||pallavi||)
nīvu sesinasem̐talu nem̐ḍu māmīm̐da nunnavi
yīvala nappaḍi mammunela dūrevu

(||nīvu||)
pĕdavibai kĕṁpulu biguvulu vaṭṭuṁḍam̐gā
yĕdurumāḍalu nīdo nem̐ṭi kāḍemu
kaḍalum̐ gannula nidra kaḍum̐ gammugŏnam̐gānu
idivo ninnum̐ gasari yelasūsemu

(||nīvu||)
paṭṭam̐gāne garivaḍi pāliṁḍlu vuṁḍam̐gānu
bĕṭṭi yelabĕnam̐gemu bīrāna nīdo
guṭṭuna jĕmaḍa maḍugulu gaṭṭugŏnam̐gānu
jaṭṭigŏni iṁkā nĕṁta sarasamāḍemu

(||nīvu||)
sigguvaḍḍasittamu simmirem̐gi vuṁḍam̐gānu
vŏggiradulagu nĕṭṭu vŏḍigaṭṭemu
niggulaśhrīveṁkaḍeśha ne nalamelumaṁganu
yĕggulega kūḍidivi yĕṁta mĕchchemu