నీవు చేసినచేఁతలు నీకు నెరి ఫలియించె
(॥పల్లవి॥)
నీవు చేసినచేఁతలు నీకు నెరి ఫలియించె
యీవల నిందుకే చెలు లిందరు నవ్వేరు
(॥నీవు॥)
కొలువుసేసేదానిఁ గొప్పువట్టితీసి నీవు
లలి నోరిలోఁ దమ్ములము వెట్టఁగా
బలిమి నాకె నీమోవిఁ బచ్చిసేఁతలెల్లాఁ జేని
మెలుపునఁ బంతములు మెరయక మానునా
(॥నీవు॥)
కడలనున్నదానిఁ దొడలసంది నిడుక
జడియుచు నీవు సరసములాడఁగా
వడిసి కస్తూరి బొట్టువన్నె నద్ది వేల నందు
అడియాలముగ నాపె అచ్చు వాయఁదగదా
(॥నీవు॥)
దండనున్నుదాని నుద్దండాన శ్రీవేంకటేశ
గండుమీరి వేడుకతోఁ గాఁగిలించగా
బెండుపడ నీవురము బిగువుఁజన్నుల నొత్తి
చండిపెట్టి రతిఁ జొక్కించఁగ నిఁక వలదా
(||pallavi||)
nīvu sesinasem̐talu nīgu nĕri phaliyiṁchĕ
yīvala niṁduge sĕlu liṁdaru navveru
(||nīvu||)
kŏluvusesedānim̐ gŏppuvaṭṭidīsi nīvu
lali norilom̐ dammulamu vĕṭṭam̐gā
balimi nāgĕ nīmovim̐ bachchisem̐talĕllām̐ jeni
mĕlubunam̐ baṁtamulu mĕrayaga mānunā
(||nīvu||)
kaḍalanunnadānim̐ dŏḍalasaṁdi niḍuga
jaḍiyusu nīvu sarasamulāḍam̐gā
vaḍisi kastūri bŏṭṭuvannĕ naddi vela naṁdu
aḍiyālamuga nābĕ achchu vāyam̐dagadā
(||nīvu||)
daṁḍanunnudāni nuddaṁḍāna śhrīveṁkaḍeśha
gaṁḍumīri veḍugadom̐ gām̐giliṁchagā
bĕṁḍubaḍa nīvuramu biguvum̐jannula nŏtti
saṁḍibĕṭṭi radim̐ jŏkkiṁcham̐ga nim̐ka valadā