Neevu sesinamelugu nenu dooraraadu

నీవు సేసినమేలుకు నేను దూరరాదు
Language

(॥పల్లవి॥)
నీవు సేసినమేలుకు నేను దూరరాదు
యీవల నా తమకము యేమని చెప్పుదుము

(॥నీవు॥)
మొగము చూచి నీవు మోహములు వెదచల్లి
జిగిమించ వలపించి చేకొంటివి
పగటున నీవెక్కడో పరాకై వుండఁగాను
యెగసక్కేలాడితి యెట్టున్నదో మనసు

(॥నీవు॥)
చనుఁగవ గోరనంటి చనవులెల్లా నొసఁగి
యెనలేని వేడుక నన్నేలితివి
ననుపున నెవ్వతెతో నవ్వితివంటా నేను
పెనఁగితి నీలోని ప్రియము లెట్టున్నవో

(॥నీవు॥)
కందువకు నీవు వచ్చి కాఁగిట నన్నుఁ బొదిగి
పొంది శ్రీవేంకటేశ్వర భోగించితివి
మందెమేళమై అలమేల్మంగని నే నీవేళను
అందితి నీమోవి నీకు ఆస యెట్లున్నదో

(||pallavi||)
nīvu sesinamelugu nenu dūrarādu
yīvala nā tamagamu yemani sĕppudumu

(||nīvu||)
mŏgamu sūsi nīvu mohamulu vĕdasalli
jigimiṁcha valabiṁchi segŏṁṭivi
pagaḍuna nīvĕkkaḍo parāgai vuṁḍam̐gānu
yĕgasakkelāḍidi yĕṭṭunnado manasu

(||nīvu||)
sanum̐gava goranaṁṭi sanavulĕllā nŏsam̐gi
yĕnaleni veḍuga nannelidivi
nanubuna nĕvvadĕdo navvidivaṁṭā nenu
pĕnam̐gidi nīloni priyamu lĕṭṭunnavo

(||nīvu||)
kaṁduvagu nīvu vachchi kām̐giḍa nannum̐ bŏdigi
pŏṁdi śhrīveṁkaḍeśhvara bhogiṁchidivi
maṁdĕmeḽamai alamelmaṁgani ne nīveḽanu
aṁdidi nīmovi nīgu āsa yĕṭlunnado