Neevu sesinadi semta neegu naddamaada nenu

నీవు చేసినది చేఁత నీకు నడ్డమాడ నేను
Language

(॥పల్లవి॥)
నీవు చేసినది చేఁత నీకు నడ్డమాడ నేను
పావన మైతిని నీపాలిదాన నేను

(॥నీవు॥)
యిందరు నెరఁగ నన్ను నిటు మన్నించిన నీవు
మందలించి యిఁక వేరె మానఁ బొయ్యెవా
పొందిన నా పొందు లివె పూఁచి నా మన సుండఁగ
సందేహ మింక నేల సత మైతి నేను

(॥నీవు॥)
కావలె ననుచు నన్నుఁ గైకొన్నఁవాడవు
వేవేలైన దగ విడిచేవా
నీ వేలివుంగర మిదె నేఁడు నాచేఁ జిక్కినది
దావతి యిఁక నేఁటికిఁ దగు లైతి నేను

(॥నీవు॥)
కచ్చుపెట్టి నీవు నన్నుఁ గాగిలంచినవాఁడవు
యిచ్చకమె నేతు గాక యెర వయ్యేవా
నిచ్చలు శ్రీవెంకటేశ నీకూటమి నాకు నబ్బె
మచ్చుమాయ లిఁక నేల మరిగితి నేను

(||pallavi||)
nīvu sesinadi sem̐ta nīgu naḍḍamāḍa nenu
pāvana maidini nībālidāna nenu

(||nīvu||)
yiṁdaru nĕram̐ga nannu niḍu manniṁchina nīvu
maṁdaliṁchi yim̐ka verĕ mānam̐ bŏyyĕvā
pŏṁdina nā pŏṁdu livĕ pūm̐si nā mana suṁḍam̐ga
saṁdeha miṁka nela sada maidi nenu

(||nīvu||)
kāvalĕ nanusu nannum̐ gaigŏnnam̐vāḍavu
vevelaina daga viḍisevā
nī velivuṁgara midĕ nem̐ḍu nāsem̐ jikkinadi
dāvadi yim̐ka nem̐ṭigim̐ dagu laidi nenu

(||nīvu||)
kachchubĕṭṭi nīvu nannum̐ gāgilaṁchinavām̐ḍavu
yichchagamĕ nedu gāga yĕra vayyevā
nichchalu śhrīvĕṁkaḍeśha nīgūḍami nāgu nabbĕ
machchumāya lim̐ka nela marigidi nenu