Neevu sesinade semta nee vimdugu nomsidivi

నీవు సేసినదే చేఁత నీ విందుకు నోఁచితివి
Language

(॥పల్లవి॥)
నీవు సేసినదే చేఁత నీ విందుకు నోఁచితివి
యీవల నవ్వేవారి నెఱఁగము గాని

(॥నీవు॥)
విన్నపము సేసినంతా వినీనంటాఁ బతితోడ
యెన్ని సన్నలు సేసేవే యెందాఁకానే
కన్నుల నవ్వేముగాని కాఁతాళించ మిందుకెల్లా
మన్నన నోరుపుగల మగఁడు గలిగెనో

(॥నీవు॥)
వేసరఁడంటా నాతని వేగినంతాఁ బొదిగేవు
ఆస యెంత నీకు గద్దే ఆడఁజాలమే
నీ సూటికి వచ్చినట్టి నేస్తకత్తెలము నేము
సేసవెట్టిన యీతఁడు చేతిలో వాఁడాయనే

(॥నీవు॥)
మొగమోడీ యీతఁడంటా ముంచి చన్నుల నొత్తేవు
యోగసక్యమా యిది యేఁటిదే యింత
తగ శ్రీవేంకటేశుఁడు తానే మమ్ముఁగూడె నేఁడు
తగ వెఱిఁగెఁ దా నంత తారుకాణ వచ్చెనే

(||pallavi||)
nīvu sesinade sem̐ta nī viṁdugu nom̐sidivi
yīvala navvevāri nĕṟam̐gamu gāni

(||nīvu||)
vinnabamu sesinaṁtā vinīnaṁṭām̐ badidoḍa
yĕnni sannalu seseve yĕṁdām̐kāne
kannula navvemugāni kām̐tāḽiṁcha miṁdugĕllā
mannana norubugala magam̐ḍu galigĕno

(||nīvu||)
vesaram̐ḍaṁṭā nādani veginaṁtām̐ bŏdigevu
āsa yĕṁta nīgu gadde āḍam̐jālame
nī sūḍigi vachchinaṭṭi nestagattĕlamu nemu
sesavĕṭṭina yīdam̐ḍu sedilo vām̐ḍāyane

(||nīvu||)
mŏgamoḍī yīdam̐ḍaṁṭā muṁchi sannula nŏttevu
yogasakyamā yidi yem̐ṭide yiṁta
taga śhrīveṁkaḍeśhum̐ḍu tāne mammum̐gūḍĕ nem̐ḍu
taga vĕṟim̐gĕm̐ dā naṁta tārugāṇa vachchĕne