నీవు సేసిన చేఁతలు నీవే తెలుసుకోరాదా
(॥పల్లవి॥)
నీవు సేసిన చేఁతలు నీవే తెలుసుకోరాదా
కావరపు చలములు గాత సేసుఁ గాక
(॥॥)
పంతమాడఁదగదా పడఁతి నీతోడుత
వింతదానితో నీవు వెస నవ్వఁ గా
దోంతులై నవలపులు దొరతనా లెరుగుగా
బంతిఁ దగ వెంచమికిఁ బచ్చి సేసుఁగాక
(॥॥)
జంకించఁ దగదా సకియకు నిన్నుఁ జూచి
పొంకముగ వింతవారిపొందు సేయఁగా
సంకెలేనితమకము సత్తువ లెరుఁగునా
లంకె పరాకై నందుకు లలి రేఁచుగాక
(॥॥)
కొసరఁగఁదగదా కొమ్మ శ్రీ వేంకటేశుఁడ
వెసఁ బొరుగాపెఁ గూడి విందియ్యకోఁగా
వసగానిజవ్వనము వంచన చూచునా తను
యెసగికూడినమేలు కిచ్చగించుఁ గాక
(||pallavi||)
nīvu sesina sem̐talu nīve tĕlusugorādā
kāvarabu salamulu gāda sesum̐ gāga
(||||)
paṁtamāḍam̐dagadā paḍam̐ti nīdoḍuda
viṁtadānido nīvu vĕsa navvam̐ gā
doṁtulai navalabulu dŏradanā lĕrugugā
baṁtim̐ daga vĕṁchamigim̐ bachchi sesum̐gāga
(||||)
jaṁkiṁcham̐ dagadā sagiyagu ninnum̐ jūsi
pŏṁkamuga viṁtavāribŏṁdu seyam̐gā
saṁkĕlenidamagamu sattuva lĕrum̐gunā
laṁkĕ parāgai naṁdugu lali rem̐sugāga
(||||)
kŏsaram̐gam̐dagadā kŏmma śhrī veṁkaḍeśhum̐ḍa
vĕsam̐ bŏrugābĕm̐ gūḍi viṁdiyyagom̐gā
vasagānijavvanamu vaṁchana sūsunā tanu
yĕsagigūḍinamelu kichchagiṁchum̐ gāga