Neevu sesina semtalu neeve talamsugonevu

నీవు చేసిన చేఁతలు నీవే తలఁచుకొనేవు
Language

(॥పల్లవి॥)
నీవు చేసిన చేఁతలు నీవే తలఁచుకొనేవు
కావరించి నీతోఁ దారుకాణించ నేమిటికి

(॥నీవు॥)
ఇచ్చకమాడినందుకు ఇయ్యకౌనవలెఁగాక
అచ్చట గతసించి ని న్నడుగనేల
కుచ్చి కాఁగిలించఁగా జేకొని లోఁగావలెఁగాక
పెచ్చువెరుగుచు నీతోఁ బెనఁగనేమిటికి

(॥నీవు॥)
చెక్కులు నీవు నొక్కఁగా చెలరేఁగవలెఁగాక
వెక్కసించి నీతో విఱ్ఱవీఁగనేల
గక్కనఁ బాదము దొక్కఁగా మొక్కవలెఁగాక
మిక్కిలి జంకించి మితిమీరఁగనేమిటికి

(॥నీవు॥)
కడు నీవు మన్నించఁగా కలయఁగవలెఁగాక
బడి బడి వట్టి సిగ్గు వడఁగనేల
కడఁగి శ్రీవేంకటేశ గక్కన న న్నేలితివి
అడరి మొచ్చుటగాక అలయనేమిటికి

(||pallavi||)
nīvu sesina sem̐talu nīve talam̐sugŏnevu
kāvariṁchi nīdom̐ dārugāṇiṁcha nemiḍigi

(||nīvu||)
ichchagamāḍinaṁdugu iyyagaunavalĕm̐gāga
achchaḍa gadasiṁchi ni nnaḍuganela
kuchchi kām̐giliṁcham̐gā jegŏni lom̐gāvalĕm̐gāga
pĕchchuvĕrugusu nīdom̐ bĕnam̐ganemiḍigi

(||nīvu||)
sĕkkulu nīvu nŏkkam̐gā sĕlarem̐gavalĕm̐gāga
vĕkkasiṁchi nīdo viṭravīm̐ganela
gakkanam̐ bādamu dŏkkam̐gā mŏkkavalĕm̐gāga
mikkili jaṁkiṁchi midimīram̐ganemiḍigi

(||nīvu||)
kaḍu nīvu manniṁcham̐gā kalayam̐gavalĕm̐gāga
baḍi baḍi vaṭṭi siggu vaḍam̐ganela
kaḍam̐gi śhrīveṁkaḍeśha gakkana na nnelidivi
aḍari mŏchchuḍagāga alayanemiḍigi