నీవు చేసిన చేఁతలు నీమీఁదికి వచ్చె
(॥పల్లవి॥)
నీవు చేసిన చేఁతలు నీమీఁదికి వచ్చె
ఆవేళ నీభాగ్యమిది యాతఁ డేమిచేసునే
(॥నీవు॥)
చనవునఁ బెనఁగఁగా చంటిమీఁద గోరు దాఁకె
కనలి విభునినేల కడు దూరేవే
పొనింగి దాఁగఁగబోతే పోఁకముడి వెడజారె
యెనలే కాతనివల్లనెంచ నేర మేదే
(॥నీవు॥)
నంటున నీవు నవ్వంగా నడుమ నీకొప్పు వీడె
జంటయైనపతినేల జంకించేవే
దంటవై మాటలాడఁగా తమకము కడురేఁగె
వెంటవెంటఁ బతినేల విరుల వేసేవే
(॥నీవు॥)
అండనే కూచుఁడఁగాను ఆయములెల్లాఁ గరఁగె
నిందు శ్రీవేంకటేశుపై నెపములేలే
దండిగా మోవి ఇచ్చితే తన్నుఁ దానే కళదాఁకె
వొండొరులు మీలో మీరు వొరయ నేమిటికే
(||pallavi||)
nīvu sesina sem̐talu nīmīm̐digi vachchĕ
āveḽa nībhāgyamidi yādam̐ ḍemisesune
(||nīvu||)
sanavunam̐ bĕnam̐gam̐gā saṁṭimīm̐da goru dām̐kĕ
kanali vibhuninela kaḍu dūreve
pŏniṁgi dām̐gam̐gabode pom̐kamuḍi vĕḍajārĕ
yĕnale kādanivallanĕṁcha nera mede
(||nīvu||)
naṁṭuna nīvu navvaṁgā naḍuma nīgŏppu vīḍĕ
jaṁṭayainabadinela jaṁkiṁcheve
daṁṭavai māḍalāḍam̐gā tamagamu kaḍurem̐gĕ
vĕṁṭavĕṁṭam̐ badinela virula veseve
(||nīvu||)
aṁḍane kūsum̐ḍam̐gānu āyamulĕllām̐ garam̐gĕ
niṁdu śhrīveṁkaḍeśhubai nĕbamulele
daṁḍigā movi ichchide tannum̐ dāne kaḽadām̐kĕ
vŏṁḍŏrulu mīlo mīru vŏraya nemiḍige