Neevu sesina semtale nelamta maim gaanibimche

నీవు సేసిన చేఁతలే నెలఁత మైఁ గానిపించె
Language

(॥పల్లవి॥)
నీవు సేసిన చేఁతలే నెలఁత మైఁ గానిపించె
చేవదీ రెందుచూచినాఁ జెలఁగీ గురుతులు

(॥నీవు॥)
చెలప చెలపలైన చెమటలతో డుత
వలపులు చెలిమేన వడిసీ నదె
అలపులు నిట్టూర్పులై ముని ముక్కునను
తలఁపులో మచ్చికలు తగిలీ నవె

(॥నీవు॥)
మొనసి మొనసినట్టి మోము కళలతోడుత
పెనగొని తమకము పెరిగీనదె
ననుపుతో సెలవులనవ్వులు చెక్కులమీఁద
నినుపులై సిగ్గులు నిండీ నవె

(॥నీవు॥)
చూడఁగఁ జూడఁగ నేఁడు సొంపగు గుబ్బలయందు
కూడిన మదరాగము గురిసీ నదె
యాడనె శ్రీవేంకటేశ యాకె యలమేల్మంగ
వేడుకలు నీవేలఁగా వెలసీ నవె

(||pallavi||)
nīvu sesina sem̐tale nĕlam̐ta maim̐ gānibiṁchĕ
sevadī rĕṁdusūsinām̐ jĕlam̐gī gurudulu

(||nīvu||)
sĕlaba sĕlabalaina sĕmaḍalado ḍuda
valabulu sĕlimena vaḍisī nadĕ
alabulu niṭṭūrbulai muni mukkunanu
talam̐pulo machchigalu tagilī navĕ

(||nīvu||)
mŏnasi mŏnasinaṭṭi momu kaḽaladoḍuda
pĕnagŏni tamagamu pĕrigīnadĕ
nanubudo sĕlavulanavvulu sĕkkulamīm̐da
ninubulai siggulu niṁḍī navĕ

(||nīvu||)
sūḍam̐gam̐ jūḍam̐ga nem̐ḍu sŏṁpagu gubbalayaṁdu
kūḍina madarāgamu gurisī nadĕ
yāḍanĕ śhrīveṁkaḍeśha yāgĕ yalamelmaṁga
veḍugalu nīvelam̐gā vĕlasī navĕ