నీవు చేసిన చేఁతకు నెలఁత యేమీ ననక
(॥పల్లవి॥)
నీవు చేసిన చేఁతకు నెలఁత యేమీ ననక
కావికన్నుల కొనల కలకల నవ్వెను
(॥నీవు॥)
మక్కువ నిన్ను దూరఁగ మనసు నొచ్చనో యని
వుక్కున జంకించఁగాను వొచ్చెమో యని
నిక్కి నిన్నుఁ జూడఁగాను నేరమి మోఁచునో యని
చెక్కు నొక్కి యింతి నిన్నుఁ జేరి నవ్వెనూ
(॥నీవు॥)
యేల రావైతి వనఁగ నిట్టె చిన్నఁ బోదు వని
వేళ గాచు కుండఁగాను వెంగెమో యని
తాలిమితో నూరకున్నఁ దల వంచుకొందు వని
వేలు ముక్కుపై మోఁవి వికవిక నవ్వెనూ
(॥నీవు॥)
చేయి వట్టి తియ్యఁగాను సిగ్గు వడుదువో యని
రాయడింపురతులకు రాఁ పయ్యే వని
యీయెడ శ్రీవెంకటేశ యిట్టె నిన్నంగన గూడి
పాయపుమదము తోడ పకపక నవ్వెను
(||pallavi||)
nīvu sesina sem̐tagu nĕlam̐ta yemī nanaga
kāvigannula kŏnala kalagala navvĕnu
(||nīvu||)
makkuva ninnu dūram̐ga manasu nŏchchano yani
vukkuna jaṁkiṁcham̐gānu vŏchchĕmo yani
nikki ninnum̐ jūḍam̐gānu nerami mom̐suno yani
sĕkku nŏkki yiṁti ninnum̐ jeri navvĕnū
(||nīvu||)
yela rāvaidi vanam̐ga niṭṭĕ sinnam̐ bodu vani
veḽa gāsu kuṁḍam̐gānu vĕṁgĕmo yani
tālimido nūragunnam̐ dala vaṁchugŏṁdu vani
velu mukkubai mom̐vi vigaviga navvĕnū
(||nīvu||)
seyi vaṭṭi tiyyam̐gānu siggu vaḍuduvo yani
rāyaḍiṁpuradulagu rām̐ payye vani
yīyĕḍa śhrīvĕṁkaḍeśha yiṭṭĕ ninnaṁgana gūḍi
pāyabumadamu toḍa pagabaga navvĕnu