Neevu sesina panulu ninne somkamgaanu

నీవు సేసిన పనులు నిన్నే సోఁకఁగాను
Language

(॥పల్లవి॥)
నీవు సేసిన పనులు నిన్నే సోఁకఁగాను
ఆవటమై పవళించే వందు కోరిచేవా

(॥॥)
కొంగు వట్టితివి నన్ను గోవిందరాజ నీవు
యెంగిలి మోవిదానను ఇందుకోపేవా
ముంగై మురాలు వెట్టేవు ముంచి నేఁ బాదాలొత్తఁగా
అంగాలు నిన్ను దాఁకగా నందు కోరిచేవా

(॥॥)
కొసరి నవ్వేవు నాతో గోవిందరాజ నీవు
యెసఁగు చెమటదాన నిందుకోపేవా
వెస నుంగర మిచ్చే వీవేళ నే బాగాలియ్యఁగా
నెసగ నీచేయి దాఁకు నిందుకోరిచేవా

(॥॥)
కూడేవు శ్రీవేంకటాద్రి గోవిందరాజ నన్ను
నీడ వాఁడిగోరిదాన నిందు కోపేవా
తోడఁ గడియాలిచ్చేవు వూడిగము నేఁ జేయఁగా
నేడేడఁ దాఁకునో నీవిందు కోరిచేవా

(||pallavi||)
nīvu sesina panulu ninne som̐kam̐gānu
āvaḍamai pavaḽiṁche vaṁdu korisevā

(||||)
kŏṁgu vaṭṭidivi nannu goviṁdarāja nīvu
yĕṁgili movidānanu iṁdugobevā
muṁgai murālu vĕṭṭevu muṁchi nem̐ bādālŏttam̐gā
aṁgālu ninnu dām̐kagā naṁdu korisevā

(||||)
kŏsari navvevu nādo goviṁdarāja nīvu
yĕsam̐gu sĕmaḍadāna niṁdugobevā
vĕsa nuṁgara michche vīveḽa ne bāgāliyyam̐gā
nĕsaga nīseyi dām̐ku niṁdugorisevā

(||||)
kūḍevu śhrīveṁkaḍādri goviṁdarāja nannu
nīḍa vām̐ḍigoridāna niṁdu kobevā
toḍam̐ gaḍiyālichchevu vūḍigamu nem̐ jeyam̐gā
neḍeḍam̐ dām̐kuno nīviṁdu korisevā