నీవు సేసిన పనులే నీకేల భ్రమయను
(॥పల్లవి॥)
నీవు సేసిన పనులే నీకేల భ్రమయను
కావించి కల గంటేనే కతలై నిలువవా
(॥నీవు॥)
జలజాక్షిచన్నులపై చందురులఁ బెట్టివేనీ
నెలవై కౌఁగిలించితే నిన్నే యంటేను
కలికి నా చేఁతు లని కాంతాళించే వప్పటిని
యిలపై నుప్పు చిందితే యినుమడి గాదా
(॥నీవు॥)
కాంతమోవిమీఁదటను కంతునిముద్రలు వెట్టె
బంతికిఁ బోతే నీ మోవిపై నంటెను
పంతమున నివి యాకెపను లంటేఁ గెరలేవు
పొంతనేపూవులలోనేపూఁపలుఁ బొడమవా
(॥నీవు॥)
యీ రమణికౌఁగిటిలో యిరవై నీవే కూడి
వూరటగా నవ్వితే నీ వుర మెక్కెను
ఆరయ శ్రీవేంకటేశ ఆపె నిట్టే మెచ్చేవు
సారెకు నేళ్లవెంటనే బాళ్లునుఁ గావా
(||pallavi||)
nīvu sesina panule nīgela bhramayanu
kāviṁchi kala gaṁṭene kadalai niluvavā
(||nīvu||)
jalajākṣhisannulabai saṁdurulam̐ bĕṭṭivenī
nĕlavai kaum̐giliṁchide ninne yaṁṭenu
kaligi nā sem̐tu lani kāṁtāḽiṁche vappaḍini
yilabai nuppu siṁdide yinumaḍi gādā
(||nīvu||)
kāṁtamovimīm̐daḍanu kaṁtunimudralu vĕṭṭĕ
baṁtigim̐ bode nī movibai naṁṭĕnu
paṁtamuna nivi yāgĕbanu laṁṭem̐ gĕralevu
pŏṁtanebūvulalonebūm̐palum̐ bŏḍamavā
(||nīvu||)
yī ramaṇigaum̐giḍilo yiravai nīve kūḍi
vūraḍagā navvide nī vura mĕkkĕnu
āraya śhrīveṁkaḍeśha ābĕ niṭṭe mĕchchevu
sārĕgu neḽlavĕṁṭane bāḽlunum̐ gāvā