Neevu sesina bhaagyamu nememani pogademu

నీవు చేసిన భాగ్యము నేమేమని పొగడేము
Language

(॥పల్లవి॥)
నీవు చేసిన భాగ్యము నేమేమని పొగడేము
సోవలుగ నిన్నేసి నీ సుద్దులెల్లా వింటిమి

(॥॥)
పైకొని పాదముమీఁదఁ బాదమువేసి బిగించి
ఆకు మడిచి నోరనే అందియ్యఁగా
నీకు నీకే కడునుబ్బి నిలువెల్లఁ జెమరించి
జోకతో వెరగందిస సుద్దులెల్ల వింటిమి

(॥॥)
చెక్కునుఁ జెక్కునుఁ మోపి శిరసుతోడ నదిమి
వొక్కటై గుబ్బల నురమూఁదఁగాను
తక్కక నీవంతలోనే తనువెల్లఁ బులకించ
చొక్కమై కళ రేఁగిన సుద్దులెల్లా వింటిమి

(॥॥)
పానుపుపై నొత్తగిలి బంతినే రతులు చూపి
ఆనుక శ్రీవేంకటేశ ఆకెఁగూడఁగా
తానకమై మీరిద్దరు తలకొని మోవితేనె
సోనలు గురిసిన మీ సుద్దులెల్లా వింటిమి

(||pallavi||)
nīvu sesina bhāgyamu nememani pŏgaḍemu
sovaluga ninnesi nī suddulĕllā viṁṭimi

(||||)
paigŏni pādamumīm̐dam̐ bādamuvesi bigiṁchi
āgu maḍisi norane aṁdiyyam̐gā
nīgu nīge kaḍunubbi niluvĕllam̐ jĕmariṁchi
jogado vĕragaṁdisa suddulĕlla viṁṭimi

(||||)
sĕkkunum̐ jĕkkunum̐ mobi śhirasudoḍa nadimi
vŏkkaḍai gubbala nuramūm̐dam̐gānu
takkaga nīvaṁtalone tanuvĕllam̐ bulagiṁcha
sŏkkamai kaḽa rem̐gina suddulĕllā viṁṭimi

(||||)
pānububai nŏttagili baṁtine radulu sūbi
ānuga śhrīveṁkaḍeśha āgĕm̐gūḍam̐gā
tānagamai mīriddaru talagŏni movidenĕ
sonalu gurisina mī suddulĕllā viṁṭimi