నీవు సేసిన భాగ్యము నే మేమని పొగడేమే
(॥పల్లవి॥)
నీవు సేసిన భాగ్యము నే మేమని పొగడేమే
యేవేళ నిన్నుఁ బాయఁడు యెంతబత్తో ఇతఁడు
(॥నీవు॥)
సేయఁ గలసింగారాలు సేసుక నీవుండఁగాను
సోయగపుఁగన్నులనుఁ జూచీ నాతఁడు
పాయపుమదములు నీపై తొలఁకఁగాను
ఆయములెరిఁగి నిన్ను నదె మెచ్చీ నితఁడు
(॥నీవు॥)
కొమ్మలు నీవు నిట్టె కొలువులో నుండఁగాను
చిమ్మిరేఁగి కడు సంతోసించీ నితఁడు
సమ్మతించి నీవు సారె సరసములాడఁ గాను
ఇమ్ముల నిన్నిటికిఁ దా నిచ్చగించీ నితఁడు
(॥నీవు॥)
చాలుకొని మోవితేనే చవులు నీవు చూపఁగా
మేలుమేలనుచు నిన్ను మెచ్చీ నితఁడు
యేలినలమేలుమంగ ఇట్టె నీవు సేవించఁగా
వేళావేళతో శ్రీవేంకటేశుఁ డితఁడు
(||pallavi||)
nīvu sesina bhāgyamu ne memani pŏgaḍeme
yeveḽa ninnum̐ bāyam̐ḍu yĕṁtabatto idam̐ḍu
(||nīvu||)
seyam̐ galasiṁgārālu sesuga nīvuṁḍam̐gānu
soyagabum̐gannulanum̐ jūsī nādam̐ḍu
pāyabumadamulu nībai tŏlam̐kam̐gānu
āyamulĕrim̐gi ninnu nadĕ mĕchchī nidam̐ḍu
(||nīvu||)
kŏmmalu nīvu niṭṭĕ kŏluvulo nuṁḍam̐gānu
simmirem̐gi kaḍu saṁtosiṁchī nidam̐ḍu
sammadiṁchi nīvu sārĕ sarasamulāḍam̐ gānu
immula ninniḍigim̐ dā nichchagiṁchī nidam̐ḍu
(||nīvu||)
sālugŏni movidene savulu nīvu sūbam̐gā
melumelanusu ninnu mĕchchī nidam̐ḍu
yelinalamelumaṁga iṭṭĕ nīvu seviṁcham̐gā
veḽāveḽado śhrīveṁkaḍeśhum̐ ḍidam̐ḍu