Neevu sesedi maayalo nemgonna marulu jaado

నీవు సేసేటి మాయలో నేఁగొన్న మరులు జాడో
Language

(॥పల్లవి॥)
నీవు సేసేటి మాయలో నేఁగొన్న మరులు జాడో
చేవమీర నేఁ జేసే సేఁత నీకే సెలవు

(॥నీవు॥)
యేకతాన నుండి మాట లెన్నియైనాఁ దలపోతు
యీకడ నీమోము చూచి ఇట్టె మొగమోడుదు
రాక నీవుండితేఁ గాతరాన కడుఁజింతింతు
చేకొని నీవద్దనుంటే చెలరేఁగి నవ్వుదు

(॥నీవు॥)
యేయింతిఇంట నీవున్నా యీసునఁ గడకుమత్తు
నీయాదరింపునఁ జెంది నే సంతోషించుకొందు
తోయరానిజవ్వనాన తొడికిపట్టఁగఁజూతు
చేయి నీవు వేసితేను చిత్తము గరఁగుదు

(॥నీవు॥)
కోరి నిన్ను నంతలోనే కూడి మందెమేళమౌదు
సారె నీవు దెలుపఁగా చనవున మొక్కుదు
యీరీతి శ్రీవేంకటేశ యే నలమేలుమంగను
నేరుపున నీ వేలఁగా నిన్నే నే నమ్ముదును

(||pallavi||)
nīvu seseḍi māyalo nem̐gŏnna marulu jāḍo
sevamīra nem̐ jese sem̐ta nīge sĕlavu

(||nīvu||)
yegadāna nuṁḍi māḍa lĕnniyainām̐ dalabodu
yīgaḍa nīmomu sūsi iṭṭĕ mŏgamoḍudu
rāga nīvuṁḍidem̐ gādarāna kaḍum̐jiṁtiṁtu
segŏni nīvaddanuṁṭe sĕlarem̐gi navvudu

(||nīvu||)
yeyiṁtiiṁṭa nīvunnā yīsunam̐ gaḍagumattu
nīyādariṁpunam̐ jĕṁdi ne saṁtoṣhiṁchugŏṁdu
toyarānijavvanāna tŏḍigibaṭṭam̐gam̐jūdu
seyi nīvu vesidenu sittamu garam̐gudu

(||nīvu||)
kori ninnu naṁtalone kūḍi maṁdĕmeḽamaudu
sārĕ nīvu dĕlubam̐gā sanavuna mŏkkudu
yīrīdi śhrīveṁkaḍeśha ye nalamelumaṁganu
nerubuna nī velam̐gā ninne ne nammudunu