Neevu sesebanulagu nera medi

నీవు సేసేపనులకు నేర మేది
Language

(॥పల్లవి॥)
నీవు సేసేపనులకు నేర మేది
తావుల నాతోఁ బెనఁగఁ దగ వేది

(॥నీవు॥)
వెలఁదులతోడనె వేగువంతాఁ బట్టె నీకు
వెలయ మాయింటికి రా వేళ యేది
కులికి మాకాతరానఁ గొసరేము గాక నిన్ను
పలుమారుఁ బలికించ బలు వేది

(॥నీవు॥)
యెక్కడనోఁ దిరుగాడ నిందాఁక బట్టె నీకు
దిక్కి మాతో రతి సేయ దల పేది
మక్కువ సేసితి గాన మాన లేము గాక నిన్ను
తక్కులఁ బెట్టగ మాకుఁ దగ వేది

(॥నీవు॥)
ఆదరించి నీమీఁద నాన వెట్టఁ బట్టె నీకు
సోదించి ని న్నవుఁగా దనఁ జో టేది
ఆదెస శ్రీవెంకటేశ అలమేలుమంగ నేను
ఆదిరించి కూడితివి అడ్డ మాడ నేది

(||pallavi||)
nīvu sesebanulagu nera medi
tāvula nādom̐ bĕnam̐gam̐ daga vedi

(||nīvu||)
vĕlam̐duladoḍanĕ veguvaṁtām̐ baṭṭĕ nīgu
vĕlaya māyiṁṭigi rā veḽa yedi
kuligi māgādarānam̐ gŏsaremu gāga ninnu
palumārum̐ baligiṁcha balu vedi

(||nīvu||)
yĕkkaḍanom̐ dirugāḍa niṁdām̐ka baṭṭĕ nīgu
dikki mādo radi seya dala pedi
makkuva sesidi gāna māna lemu gāga ninnu
takkulam̐ bĕṭṭaga māgum̐ daga vedi

(||nīvu||)
ādariṁchi nīmīm̐da nāna vĕṭṭam̐ baṭṭĕ nīgu
sodiṁchi ni nnavum̐gā danam̐ jo ṭedi
ādĕsa śhrīvĕṁkaḍeśha alamelumaṁga nenu
ādiriṁchi kūḍidivi aḍḍa māḍa nedi