Neevu sese semtalagu nemdu naagu

నీవు సేసే చేఁతలకు నేఁడు నాకు
Language

(॥పల్లవి॥)
నీవు సేసే చేఁతలకు నేఁడు నాకు
తావున వూరకే వుండి తలవంచఁ దగదా

(॥నీవు॥)
తెలిపి చెప్పినదాఁకాఁ దెరఁదీసితినింతే
తలపోఁతే తెరగాదా తరవాతను
మొలకనవ్వులూరకె ముంచీఁగాక
సెలవుల చెలుల మోము చూచితే సిగ్గువడఁదగదా

(॥నీవు॥)
మనసువచ్చినదాఁకా మాటలాడితినింతే
కనుచూపే మాటగాదా కడు గుట్టున
ఘనమై చెక్కుల వెంటఁ గళలుదేరీ నేలో
వనిత లిందరిలోన వాసి నుండఁదగదా

(॥నీవు॥)
రతుల మెచ్చినదాఁకా రాజసాననుంటి మింతే
అతిరాజసము గాదా అరమరపు
యితవై శ్రీ వేంకటేశ యిట్టె నన్నుఁగూడితివి
మితిమీరవలదా మెలఁతుల వొద్దను

(||pallavi||)
nīvu sese sem̐talagu nem̐ḍu nāgu
tāvuna vūrage vuṁḍi talavaṁcham̐ dagadā

(||nīvu||)
tĕlibi sĕppinadām̐kām̐ dĕram̐dīsidiniṁte
talabom̐te tĕragādā taravādanu
mŏlaganavvulūragĕ muṁchīm̐gāga
sĕlavula sĕlula momu sūside sigguvaḍam̐dagadā

(||nīvu||)
manasuvachchinadām̐kā māḍalāḍidiniṁte
kanusūbe māḍagādā kaḍu guṭṭuna
ghanamai sĕkkula vĕṁṭam̐ gaḽaluderī nelo
vanida liṁdarilona vāsi nuṁḍam̐dagadā

(||nīvu||)
radula mĕchchinadām̐kā rājasānanuṁṭi miṁte
adirājasamu gādā aramarabu
yidavai śhrī veṁkaḍeśha yiṭṭĕ nannum̐gūḍidivi
midimīravaladā mĕlam̐tula vŏddanu