Neevu sallamgaa badugu nee kela yee godava

నీవు చల్లఁగా బదుకు నీ కేల యీ గొడవ
Language

(॥పల్లవి॥)
నీవు చల్లఁగా బదుకు నీ కేల యీ గొడవ
నీ వలపులకు నెల్లా నేనే గుఱి

(॥నీవు॥)
చెక్కు నొక్కకురా నా చెమట నీచేత నంటీ
గక్కన నీకుఁగానైన కరఁగు లివి
యెక్కువ నాతాపము నీవేల కట్టుకొనేవు నే
బుక్కట నాలో నెట్టయినాఁ బొరలేఁ గానీ

(॥నీవు॥)
కౌఁగిలించకురా నాకాఁకల నీమేను వాడీ
తీఁగెల నీవల్లనైన తేజము లివి
నీఁగని నా మరు లిదె నీవు చుట్టుకొన నేల
ఆఁగి నేనే పొట్టువొరు లియ్యేఁ గాని

(॥నీవు॥)
నామోవి యడుగకురా నానలేదు కడు నెండే
వేమరు నీవల్లనైన వెట్టలవి
ఆముకొని శ్రీవేంకటాధిప కూడితి వింక
సోమరినై నాలోనే చొక్కేఁ గాని

(||pallavi||)
nīvu sallam̐gā badugu nī kela yī gŏḍava
nī valabulagu nĕllā nene guṟi

(||nīvu||)
sĕkku nŏkkagurā nā sĕmaḍa nīseda naṁṭī
gakkana nīgum̐gānaina karam̐gu livi
yĕkkuva nādābamu nīvela kaṭṭugŏnevu ne
bukkaḍa nālo nĕṭṭayinām̐ bŏralem̐ gānī

(||nīvu||)
kaum̐giliṁchagurā nāgām̐kala nīmenu vāḍī
tīm̐gĕla nīvallanaina tejamu livi
nīm̐gani nā maru lidĕ nīvu suṭṭugŏna nela
ām̐gi nene pŏṭṭuvŏru liyyem̐ gāni

(||nīvu||)
nāmovi yaḍugagurā nānaledu kaḍu nĕṁḍe
vemaru nīvallanaina vĕṭṭalavi
āmugŏni śhrīveṁkaḍādhiba kūḍidi viṁka
somarinai nālone sŏkkem̐ gāni