నీవు రాఁగా వలపుల నిండెను బండారములు
(॥పల్లవి॥)
నీవు రాఁగా వలపుల నిండెను బండారములు
చేవదేరెఁ బనులెల్లా చిత్తగించవయ్యా
(॥నీవు॥)
వనితమై చెమటలవానలు నిండాఁ గురిసె
మనసెల్లాఁ జిగిరించె మచ్చికలకు
ఘనమైనపులకల కమ్మని జాజులుమించె
కనుఁగొనవయ్యా చనుకసుఁగాయలు నవె
(॥నీవు॥)
నతిమోవితేనెల చాలాఁ బంటలు వండె
తతిఁ గళలచే వసంతము వచ్చెను
సతమై నిట్టూర్పుల చల్లగాని విహరించె
రతి జూడవయ్యా మోహరసములును నవె
(॥నీవు॥)
కూరిమి నలమేల్ మంగకోరికెఁ దీగెలువారె
గారవపుతమకము కాఁగిటఁ బాంకె
యీరీతి శ్రీవేంకటేశ యీకె నిట్టె యేలితివి
సారె భోగించవయ్యా జవ్వనవన మదె
(||pallavi||)
nīvu rām̐gā valabula niṁḍĕnu baṁḍāramulu
sevaderĕm̐ banulĕllā sittagiṁchavayyā
(||nīvu||)
vanidamai sĕmaḍalavānalu niṁḍām̐ gurisĕ
manasĕllām̐ jigiriṁchĕ machchigalagu
ghanamainabulagala kammani jājulumiṁchĕ
kanum̐gŏnavayyā sanugasum̐gāyalu navĕ
(||nīvu||)
nadimovidenĕla sālām̐ baṁṭalu vaṁḍĕ
tadim̐ gaḽalase vasaṁtamu vachchĕnu
sadamai niṭṭūrbula sallagāni vihariṁchĕ
radi jūḍavayyā moharasamulunu navĕ
(||nīvu||)
kūrimi nalamel maṁgagorigĕm̐ dīgĕluvārĕ
gāravabudamagamu kām̐giḍam̐ bāṁkĕ
yīrīdi śhrīveṁkaḍeśha yīgĕ niṭṭĕ yelidivi
sārĕ bhogiṁchavayyā javvanavana madĕ