Neevu nitlanaide nemdimka jaanalu veree

నీవు నిట్లనైతే నేఁడిఁక జాణలు వేరీ
Language

(॥పల్లవి॥)
నీవు నిట్లనైతే నేఁడిఁక జాణలు వేరీ
చేవదేరెఁ బనులెల్ల చేచేఁత నిప్పుడు

(॥నీవు॥)
నిండుఁబరితాపమున నిన్నుఁ జెలి గొసరితే
అండనే యెగ్గులు వట్టేవయ్యో నీవు
వండ వండనట్లాయ వనితల వలపులు
చండిపెట్టేమగవారి సరవుల చేతను

(॥నీవు॥)
కలయని కాఁతాళాన కలికి నీకలిగితే
అలరి మారలిగేవు అయ్యో నీవు
యిలనెండపసపాయ యింతుల ప్రియములెల్ల
నలువంకఁ బురుషుల నడవడిచేతను

(॥నీవు॥)
మందెమేళమున నిన్ను మానినిచేయి మోపితే
అందరి సాకిరి వెట్టేవయ్యో నీవు
కందువ శ్రీవేంకటేశ కమ్మటిఁ గూడితివిట్టే
కందుదేరె నీవంటి ఘనులచేతను

(||pallavi||)
nīvu niṭlanaide nem̐ḍim̐ka jāṇalu verī
sevaderĕm̐ banulĕlla sesem̐ta nippuḍu

(||nīvu||)
niṁḍum̐baridābamuna ninnum̐ jĕli gŏsaride
aṁḍane yĕggulu vaṭṭevayyo nīvu
vaṁḍa vaṁḍanaṭlāya vanidala valabulu
saṁḍibĕṭṭemagavāri saravula sedanu

(||nīvu||)
kalayani kām̐tāḽāna kaligi nīgaligide
alari māraligevu ayyo nīvu
yilanĕṁḍabasabāya yiṁtula priyamulĕlla
naluvaṁkam̐ buruṣhula naḍavaḍisedanu

(||nīvu||)
maṁdĕmeḽamuna ninnu māniniseyi mobide
aṁdari sāgiri vĕṭṭevayyo nīvu
kaṁduva śhrīveṁkaḍeśha kammaḍim̐ gūḍidiviṭṭe
kaṁduderĕ nīvaṁṭi ghanulasedanu