Neevu nerbidivo nelamtagunamulo

నీవు నేర్పితివో నెలఁతగుణములో
Language

(॥పల్లవి॥)
నీవు నేర్పితివో నెలఁతగుణములో
వేవేలు గనుఁగొని వెరగయ్యీని

(॥నీవు॥)
సాములు సేయుచు సరసపు మాటల
ప్రేమ మిదెవ్వతె పెంచీని
దోమటి దొడికిన తొయ్యలి యుండఁగ
యీమగు వేఁటికె యిరవుకొనీని

(॥నీవు॥)
కానుక లొసఁగుచు కమ్మరఁ గమ్మర
తానెవ్వ రిచటఁ దగలీని
తోనె పెండ్లి కూఁతురు నిలుచుండఁగ
ఆనుక నీకేల ఆసపడీని

(॥నీవు॥)
కలకలనవ్వుచు గడుఁ బానుపుపై
చెలుముల తానేల చేసీని
అలమేలుమంగ నీ కదె వురమెక్కఁగ
బలు శ్రీవేంకటపతి యిది యొకతె

(||pallavi||)
nīvu nerbidivo nĕlam̐taguṇamulo
vevelu ganum̐gŏni vĕragayyīni

(||nīvu||)
sāmulu seyusu sarasabu māḍala
prema midĕvvadĕ pĕṁchīni
domaḍi dŏḍigina tŏyyali yuṁḍam̐ga
yīmagu vem̐ṭigĕ yiravugŏnīni

(||nīvu||)
kānuga lŏsam̐gusu kammaram̐ gammara
tānĕvva risaḍam̐ dagalīni
tonĕ pĕṁḍli kūm̐turu nilusuṁḍam̐ga
ānuga nīgela āsabaḍīni

(||nīvu||)
kalagalanavvusu gaḍum̐ bānububai
sĕlumula tānela sesīni
alamelumaṁga nī kadĕ vuramĕkkam̐ga
balu śhrīveṁkaḍabadi yidi yŏgadĕ